AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది

ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నట వారసులు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఓ నటి కూతురు కూడా ఇండస్ట్రీలోకి రానున్నారని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న నటిగా వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2026 | 11:27 AM

Share

నటి జోవిక ఈ ముద్దుగుమ్మ ఇటీవలే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అగాధ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జోవిక. కాగా తాజాగా ఓ ఓఇంటర్వ్యూలో తన తాతయ్య, ప్రముఖ సీనియర్ నటుడు విజయకుమార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాల్యం నుంచి తన సినీ ప్రయాణం వరకు విజయకుమార్ ప్రభావం, తన తల్లి వనితా విజయకుమార్ అందించిన అండదండల గురించి జోవిక అనేక విషయాలను పంచుకుంది. ముందుగా తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, చిన్నప్పుడు తన అమ్మమ్మ ఇంట్లో సుమారు 10-15 మంది కజిన్స్‌తో కలిసి సమ్మర్ హాలిడేస్‌లో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంది. “ఒక హోల్ ఫంక్షన్ లాగా ఉండేది. 10 నుండి 15 మంది పిల్లలు ఒకే చోట ఉంటే అదో గందరగోళమే, కానీ ఆ రోజులను ఎంతో ఆస్వాదించాను” అని జోవిక చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

అనంతరం, తన తాతయ్య విజయకుమార్‌తో ప్రస్తుత సంబంధం గురించి మాట్లాడుతూ, దాదాపు 8-9 సంవత్సరాలుగా ఆయనతో మాట్లాడలేదని తెలిపింది. మేము ఇప్పుడు కాంటాక్ట్‌లో లేము అని చెప్పినప్పటికీ, విజయకుమార్ పట్ల తనకున్న గౌరవం, ఆయన్నుండి నేర్చుకున్న విషయాల గురించి జోవిక చెప్పుకొచ్చింది. “ఆయనెక్కడ ఉన్నా బాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన నాకు బాగానే ఉన్నారని తెలుసు” అని తెలిపింది. అలాగే ప్రొఫెషనలిజం గురించి ఆయన నుండి చాలా నేర్చుకోవచ్చు. ఆయన అత్యంత ప్రొఫెషనల్ నటులలో ఒకరు. ఆయనంత అంకితభావం కలిగిన నటుడిని నేను ఎప్పుడూ చూడలేదు” అని జోవిక కొనియాడింది. విజయకుమార్ గెటప్‌లు, పాత్రలు, ఒక దర్శకుడి నటుడిగా, నిర్మాత నటుడిగా ఆయన అందించిన సహకారం ఎంతో గొప్పదని తెలిపారు. “ఆయనలాంటి నటులు మరెందరో ఉంటే బాగుండు అని కోరుకుంటున్నాను. ఆయన నుంచి నేను చాలా స్ఫూర్తి పొందుతాను. కనీసం కొంచమైనా ఆయనలా ఉండాలని ఆశిస్తున్నాను” అని జోవిక తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

ప్రస్తుతం విజయకుమార్ చాలా సెలెక్టివ్‌గా తాత, తండ్రి పాత్రలు మాత్రమే చేస్తున్నారని ఆమె తెలిపారు. తన సినీ కెరీర్‌లో తల్లి వనితా విజయకుమార్ పోషిస్తున్న కీలక పాత్ర గురించి జోవిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. నాకు ఫ్యామిలీ సపోర్ట్ గురించి అడిగితే, నా తల్లి నా కుటుంబం. ఆమె మద్దతు లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో తెలియదు” అని జోవిక ఎమోషనల్ అయ్యింది. సరైన స్క్రిప్ట్‌లు, చిత్రాలను ఎంచుకునే అవకాశం, ఆ ప్రత్యేక హక్కు తనకు తల్లి వల్లే లభించిందని, ఆమె మిగిలిన ప్రతిదీ చూసుకుంటున్నారు కాబట్టే నేను నా పని మీద దృష్టి పెట్టగలుగుతున్నాను. నేను దానికి ఎంతో కృతజ్ఞురాలిని” అని జోవిక చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?
టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే
టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే