AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

తెలుగు నటి ఇంద్రజ ఓ స్టార్ హీరోతో డ్యాన్స్ చేయాలన్న తన చిరకాల కోరికను పంచుకున్నారు. ఆయనతో నటించే అవకాశం రెండుసార్లు వచ్చినా, డ్యాన్స్ చేయాలనే బలమైన ఆకాంక్షతో చెల్లెలి పాత్రలను వదులుకున్నానని ఆమె తెలిపారు. ఆ హీరో డాన్స్, వ్యక్తిత్వాన్ని ఎంతో మెచ్చుకున్నారు.

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ
Indraja
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2026 | 12:14 PM

Share

తెలుగు సినీ నటి ఇంద్రజ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలతో పాటు టీవీ షోల్లోనూ పాల్గొంటున్నారు ఇంద్రజ. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు ఇంద్రజ. కాగా ఓ ఇంటర్వ్యూలో ఇంద్రజ మాట్లాడుతూ.. అనేక విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేయాలన్న తన కోరికను వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి నటించే అవకాశం రెండుసార్లు వచ్చినా, డ్యాన్స్ చేయాలన్న తన బలమైన కోరికతో ఆ అవకాశాలను వదులుకున్నానని ఇంద్రజ తెలిపారు. చిరంజీవి పక్కన చెల్లెలిపాత్ర వచ్చిందని ఇంద్రజ తెలుపారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన అల్లుడా మజాకా చిత్రంలో చిరంజీవి గారికి సిస్టర్ పాత్రకు అవకాశం వచ్చిందని ఆమె తెలిపారు. అయితే, ఆయనకు సిస్టర్‌గా నటించే ఛాన్స్ వచ్చింది ఆ పాత్రను వదులుకున్నట్లు చెప్పారు. సిస్టర్ పాత్ర కాకుండా హీరోయిన్‌గా చేస్తేనే ఆయనతో డ్యాన్స్ సాధ్యమవుతుందని తన మనసులో ఉందని ఆమె వివరించారు.

ఇది కూడా చదవండి :

బుర్రపాడు మావ..! జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

రెండోసారి, ఎడిటర్ మోహన్ నిర్మించిన హిట్లర్ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ పక్కన నటించే అవకాశం లభించింది. ఈ చిత్రం చిరంజీవి  కీలక పాత్రలో రూపొందింది. అయితే, సరిగ్గా అప్పుడే తాను ఒక తమిళ చిత్రంలో నటిస్తుండడంతో, హిట్లర్ చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయానని ఇంద్రజ పేర్కొన్నారు. చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చినా మిస్ అయినందుకు ఆమె కొంత బాధను వ్యక్తం చేశారు. ఆయనతో కనీసం ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలన్నదే తన ఏకైక కోరిక అని ఇంద్రజ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి :

వరుసగా 15 ఫ్లాపులు.. సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చిత్రాలు

“డ్యాన్స్ అంటే చిరంజీవి గారు పెట్టిన పేరు కదా” అని ఆమె అన్నారు, అలాగే వాల్తేరు వీరయ్యలో ఆయన డ్యాన్స్‌ను కూడా ప్రశంసించారు. డ్యాన్స్‌తో పాటు, చిరంజీవి గారి మాట్లాడే విధానం, అందరితో వ్యవహరించే తీరు, ఎంత కోపమున్నా జాగ్రత్తగా ఉండే పద్ధతిని తాను గమనించి నేర్చుకున్నానని తెలిపారు. అదేవిధంగా ఇంద్రజ తన కుటుంబానికి బలమైన సంగీత నేపథ్యం ఉందని కూడా తెలియజేశారు. తన తల్లి కర్ణాటక సంగీత విద్వాంసురాలు అనితెలిపారు తమ పూర్వీకులు చిత్తూరుకు చెందినవారైనప్పటికీ, ఉద్యోగ రీత్యా తన తాతగారు త్రివేండ్రంలో స్థిరపడ్డారని చెప్పారు.  అయితే, సంగీతం పట్ల తనకు ఆసక్తి ఉందని, ఖాళీ సమయాల్లో, వంట చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటానని ఇంద్రజ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఆ హీరో మామూలోడు కాదు.. అతను చేసింది చూసి మాకు మైండ్ పోయింది

Chiranjeevi

Chiranjeevi

Follow Us