AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో మామూలోడు కాదు.. అతను చేసింది చూసి మాకు మైండ్ పోయింది

సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించారు చాలా మంది. వారిలో ఈ నటుడు ఒకరు.ఆయన విలన్ గా చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆయన ఎవరో కాదు అమిత్ తివారి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆ హీరో మామూలోడు కాదు.. అతను చేసింది చూసి మాకు మైండ్ పోయింది
Amith
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2026 | 1:30 PM

Share

నటుడు అమిత్ తివారీ గుర్తున్నాడా.? విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు అమిత్. ఈ నటుడు విలన్ గానే కాదు.. విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలతో పాటు బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో తన అనుబంధం గురించి, ఆయన అద్భుతమైన నటన, డాన్స్ నైపుణ్యాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభవమని, ఆయన నటనలో, వ్యక్తిత్వంలో అద్భుతమైన ప్రతిభావంతుడని అమిత్ తివారీ చెప్పుకోచ్చాడు. ముఖ్యంగా, ఎన్టీఆర్ అసాధారణ డాన్స్ సామర్థ్యాన్ని వివరిస్తూ, రభస సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు.

రభస సినిమా చిత్రీకరణలో భాగంగా, ఒక రాత్రి కుటుంబ వాతావరణంలో జరిగే డాన్స్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్‌లో ఒక  పెద్ద బీజీఎం పార్ట్ డాన్స్ బిట్ ఉంది. ఇది దాదాపు 30-40 సెకన్ల పాటు సాగుతుందని అమిత్ తివారీ తెలిపారు. ఈ డాన్స్ కోసం కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ ముందుగా స్టెప్స్‌ను చేసి చూపించారు. అసిస్టెంట్ స్టెప్స్ చేస్తూ ఉండగా, అమిత్ తివారీ తన బెస్ట్ ఫ్రెండ్ శ్రవణ్, రవిప్రకాష్, అజయ్ లతో కలిసి పక్కనే నిల్చొని చూస్తున్నారని చెప్పారు. నందు కూడా ఆ పాటలో ఉన్నాడని, ఈ సంఘటనను నందు కూడా గుర్తుచేసుకున్నాడని అమిత్ తెలిపారు.

అసిస్టెంట్ టకటకమని ఆ స్టెప్స్‌ను దాదాపు ఏడు నుండి పదిసార్లు చేసి చూపించారు. ఆ తర్వాత హీరో గారిని పిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి “ఏంటి స్టెప్?” అని అడిగారు. అసిస్టెంట్ మరోసారి స్టెప్స్ చేసి చూపించారు. ఎన్టీఆర్ దాదాపు 75-80 శాతం స్టెప్‌ను తన మనసులో కాపీ చేసేసుకున్నారని అమిత్ తివారీ అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ “మాస్టర్, ఒకసారి ట్రై చేద్దాం” అని చెప్పారని, ఎలాంటి రిహార్సల్స్ లేకుండా, కేవలం రెండుసార్లు చూసిన వెంటనే ఆయన టేక్‌కి సిద్ధమయ్యారని అమిత్ తివారీ చెప్పుకొచ్చాడు. ఇది చూసి తామందరం షాకయ్యామని, సినిమాలో చూసేటప్పుడు రిహార్సల్స్ ఉంటాయని అనుకుంటామని, కానీ లైవ్‌లో ఇలా చూడటం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ వచ్చి రెడీ, మ్యూజిక్ ఆన్ అనగానే, అద్భుతంగా డాన్స్ చేశారని డాన్స్ చేసిన తర్వాత ఎన్టీఆర్ స్వయంగా, “మాస్టర్, ఆ పాయింట్ దగ్గర కొంచెం స్టెప్ మిస్ అయింది” అని చెప్పారని, రెండో టేక్‌లో అది కూడా సరిచేసి, ఎన్టీఆర్ ఆ కష్టమైన డాన్స్ సీక్వెన్స్‌ను ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే పూర్తి చేశారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us