AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుసగా 15 ఫ్లాపులు.. సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చిత్రాలు

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. ఏ నటుడికైనా ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. కొన్ని సార్లు ఎంత ప్రయతించిన విజయాలు దక్కవు. అలానే ఓ స్టార్ హీరోకు వరుసగా 15 ఫ్లాపులు ఎదురయ్యాయి. అయినా ఎక్కడ నిరాశపడకుండా సినిమాలు చేసి స్టార్ అయ్యాడు.

వరుసగా 15 ఫ్లాపులు.. సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చిత్రాలు
Hero
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2026 | 8:50 AM

Share

తెలుగు సినీ చరిత్రలో సూపర్‌స్టార్ కృష్ణ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అన్నింటిని ఎదుర్కొని నెంబర్ వన్ అయ్యారు. వాటిలో ఒకటి వరుసగా 15 చిత్రాల పరాజయం. ఏ హీరోకైనా ఇదొక పెను సవాలు, కెరీర్‌కు మరణశాసనం లాంటిది. కానీ కృష్ణ, తన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఆ కష్టకాలాన్ని అధిగమించి తిరుగులేని హీరోగా నిలబడ్డారు. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితేనే హీరోలకు అవకాశాలు తగ్గడం, నిర్మాతలు వెనకడుగు వేయడం చూస్తుంటాం. అలాంటిది “అల్లూరి సీతారామరాజు” లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వరుసగా 15 సినిమాలు అపజయం పాలయ్యాయి. కనీసం బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయి వసూళ్లను కూడా సాధించలేకపోయాయి.

ఈ పరిస్థితిలో చాలా మంది సినీ ప్రముఖులు కృష్ణకు సినీ పరిశ్రమను వదిలిపెట్టి వేరే వ్యాపారం చూసుకోమని సలహా ఇచ్చారట. ఈ మాటలు ఏ హీరోనైనా కుంగదీస్తాయి. కానీ కృష్ణ నిరాశ చెందలేదు, పడ్డ చోటు నుంచే లేచి నిలబడాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. ఆయన సినీ ప్రస్థానంలో ఒక విలక్షణమైన పంథాను అనుసరించారు. ఇతర హీరోల మాదిరిగా స్క్రిప్ట్‌లలో జోక్యం చేసుకోకుండా, దర్శకుల విజన్‌ను గౌరవించేవారు. దర్శకుడికే అన్నీ తెలుసు అని నమ్మి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఈ స్వేచ్ఛే ఆయన్ను సూపర్‌స్టార్‌గా నిలబెట్టింది. అయితే, వరుస పరాజయాల కారణంగా ఏ నిర్మాత కూడా కృష్ణను నమ్మి సినిమాలు తీయడానికి ముందుకు రాలేదు. ఈసడింపు మాటలు కూడా వినిపించాయి.

ఈ విపత్కర పరిస్థితుల్లో కృష్ణ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, తానే స్వయంగా నిర్మాతగా మారాలని నిశ్చయించుకున్నారు. తన సొంత బ్యానర్ పద్మాలయా మూవీస్ను స్థాపించారు. ఈ బ్యానర్ ద్వారా కృష్ణ తొలిసారిగా నిర్మించిన చిత్రం పాడిపంటలు. ఈ సినిమాపై మొదట్లో ఎటువంటి అంచనాలు లేవు. పదిహేను ఫ్లాపుల తర్వాత వస్తున్న సినిమా కావడంతో విజయంపై ఎవరికీ నమ్మకం లేదు. కానీ కృష్ణ మాత్రం చాలా ధైర్యంగా, నమ్మకంతో సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు. పాడిపంటలు సినిమా అనూహ్యంగా ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ విజయంతో కృష్ణకు పూర్వ వైభవం తిరిగి వచ్చింది. నిర్మాతలు మళ్ళీ ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కట్టారు. అయితే, కృష్ణ ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశారు. తన కష్టకాలంలో తనకు అండగా నిలిచిన పద్మాలయా మూవీస్ బ్యానర్‌ను గౌరవిస్తూ, రాబోయే 15 సంవత్సరాల పాటు వేరే ఏ ఇతర బ్యానర్లలోనూ సినిమాలు చేయనని ఒట్టు పెట్టుకున్నారు. ఈ ప్రతిజ్ఞను కృష్ణ తన చివరి శ్వాస వరకు నిలబెట్టుకున్నారు. ఆ పదిహేనేళ్ల కాలంలో ఆయన కేవలం పద్మాలయా మూవీస్ బ్యానర్‌పైనే అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ, నటిస్తూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు.

ఇవి కూడా చదవండి

Krishna

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us