AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. 8.7 రేటింగ్‌తో టాప్‌లో ట్రెండింగ్.. ఎక్కడ చూడొచ్చంటే

ఎప్పటిలాగే ఈ వీకెండ్ లో కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అలాగే ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి చేస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. 8.7 రేటింగ్‌తో టాప్‌లో ట్రెండింగ్.. ఎక్కడ చూడొచ్చంటే
Ott
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2026 | 12:22 PM

Share

ఓటీటీల్లో సినిమాలకు బ్రహ్మరధం పడుతున్నారు. వీకెండ్ వస్తే చాలు ఆడియన్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీలో వారం వారం పదికి పైగా సినిమాలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి.కేవలం తెలుగు సినిమాలే కాదు.. డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీని షేక్ చేస్తున్నాయి. ఇక ఓటీటీలో ఎక్కువగా అలరిస్తున్న సినిమాల్లో రొమాంటిక్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా ఉంటాయి. ఇక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.

1999 కార్గిల్ యుద్ధంలో భారత రక్షణ దళాలు చేపట్టిన అతిపెద్ద ఎయిర్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది కార్గిల్ వార్’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్, భారత వైమానిక దళం (IAF) ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. హిమాలయాల్లో తీవ్రమైన ప్రతికూల వాతావరణం, మంచు కొండల్లో శత్రువుల చొరబాట్లను తిప్పికొట్టేందుకు ఐఏఎఫ్ చేపట్టిన కీలక మిషనే ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. ఈ సిరీస్ లో ప్రధానంగా ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్‌లోని యుద్ధ విమాన పైలట్లు ఎదుర్కొన్న సవాళ్లు, ఆపదలు మరియు వారి కుటుంబాలు చేసిన త్యాగాల చుట్టూ కథ తిరుగుతుంది.

ఈ సిరీస్‌లో నటుడు సిద్ధార్థ్ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా అనే నిఖార్సయిన హీరో పాత్రలో నటించారు. సిద్ధార్థ్‌తో పాటు జిమ్మీ షేర్‌గిల్ (వింగ్ కమాండర్ బి.ఎస్. ధనోవా పాత్రలో), వినయ్ పాఠక్, అభయ్ వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఒని సేన్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఐఏఎఫ్ అధికారుల సలహాలతో, నిజమైన ఎయిర్ ఫోర్స్ బేస్‌లలో చిత్రీకరించిన ఏరియల్ యాక్షన్ షాట్స్ సిరీస్‌కి విజువల్ గ్రాండియర్ తెచ్చిపెట్టాయి. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ను మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us