AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్రపాడు మావ..! జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో జయం సినిమా ఒకటి. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2002లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఇందులో నితిన్, సదా హీరోయిన్లుగా నటించగా.. గోపీచంద్ విలన్ పాత్ర పోషించారు.

బుర్రపాడు మావ..! జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Jayam
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2026 | 10:38 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హిట్స్ లేక సతమతం అవుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు నితిన్. ఇక ఇప్పుడు  నాని ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ కుర్రహీరో వెండితెరకు పరిచయమైన సినిమా జయం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈసినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు యూత్‏కు తెగ నచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండస్ట్రీని షేక్ చేసింది జయం సినిమా. ఇందులో నితిన్ సరసన సదా హీరోయిన్ గా నటించింది. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నితిన్, సదా ఇద్దరూ తెలుగు తెరకు నటీనటులుగా పరిచయంకాగా.. అప్పట్లో జయం సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు.

అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ గురించి తెలిసిందే. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో హీరో గోపిచంద్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. తన నటనతో గోపీచంద్ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో గోపిచంద్ గర్ల్ ఫ్రెండ్‌గా నటించిన బ్యూటీ గుర్తుందా..? ఈ మూవీలో ఆమె కనిపించింది కాసేపే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ బ్యూటీ రియల్ పేరు అనామిక ప్రవళిక. తెలుగుతోపాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కానీ తెలుగులో ఈ ముద్దుగుమ్మ పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. సీరియల్ నటిగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇక సీరియల్స్ లో శిఖరం, సీతామహాలక్ష్మి వంటి సీరియల్స్ ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. అలాగే రాత్రి , రూ.999 మాత్రమే, సంభవామి యుగే యుగే, పిల్ల దొరికితే పెళ్లి ఇలా పలు చిత్రాల్లో నటించింది. కానీ జయం సినిమాతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఎక్కువగా బోల్డ్ పాత్రలే వచ్చాయి. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలతో ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ట్రై చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Jayam Actress

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరికొద్దిసేపట్లో హైఓల్టేజీ మ్యాచ్.. రికార్డుల్లో తోపు ఎవరంటే?
మరికొద్దిసేపట్లో హైఓల్టేజీ మ్యాచ్.. రికార్డుల్లో తోపు ఎవరంటే?
15 ఏళ్లుగా ఒకే టిఫిన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పాటించే..
15 ఏళ్లుగా ఒకే టిఫిన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పాటించే..
ఇంట్లో బట్టలు ఆరవేస్తున్నారా? ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
ఇంట్లో బట్టలు ఆరవేస్తున్నారా? ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
అరెరే.. రంగు చూసి మోసపోకండి.. కెమికల్ అరటిపండ్లను చిటికెలో..
అరెరే.. రంగు చూసి మోసపోకండి.. కెమికల్ అరటిపండ్లను చిటికెలో..
ఈ రైలు 7 గంటల్లో 6 రాష్ట్రాలను దాటుతూ, 527 కిలోమీటర్లు!
ఈ రైలు 7 గంటల్లో 6 రాష్ట్రాలను దాటుతూ, 527 కిలోమీటర్లు!
నవంబర్‌ 11 నుంచి DSC 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. లింక్
నవంబర్‌ 11 నుంచి DSC 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. లింక్
8 నెలలు చెప్పులు లేకుండా.. నేలపై పడుకునేవాడిని..
8 నెలలు చెప్పులు లేకుండా.. నేలపై పడుకునేవాడిని..
దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా సామాగ్రి, మంత్రాలు
దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా సామాగ్రి, మంత్రాలు
100 ఏళ్ల క్రితం దీపావళి.. ఆ 11 ప్రమిదల వెనుక దాగున్న కన్నీటి..
100 ఏళ్ల క్రితం దీపావళి.. ఆ 11 ప్రమిదల వెనుక దాగున్న కన్నీటి..
శని శుక్రుల అనుగ్రహం..అనూహ్య మార్గాల్లో వీరికి డబ్బే డబ్బు..
శని శుక్రుల అనుగ్రహం..అనూహ్య మార్గాల్లో వీరికి డబ్బే డబ్బు..