ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!!
మంచు మనోజ్ కెరీర్ ప్రారంభంలో నటించిన సూపర్ హిట్ సినిమాల్లో బిందాస్ ఒకటి. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. 2010లో రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మనోజ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. వీరూ పోట్ల తెరకెక్కించిన బిందాస్ సినిమాలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా షీనా షహబాది నటించింది.

మంచు మోహన్ బాబు నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్, అతి తక్కువ కాలంలోనే తనదైన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ఆయన యాక్షన్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన చిత్రాలలో బిందాస్ ఒకటి. 2010లో ఏకే ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మనోజ్‌కు జోడీగా నటించి, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి షీనా షాహబాది. సినిమాలో ఆమె పాత్ర పేరు గిరిజతోనే ఎక్కువ మంది గుర్తుపడతారు. ఆతర్వాత పెద్దగా కనిపించలేదు ఈ అమ్మడు. ఆమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇది కూడా చదవండి :
బుర్రపాడు మావ..! జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
షీనా షాహబాది సినీ నేపథ్యం బలమైనది. ఆమె తల్లి బాలీవుడ్ ప్రముఖ నటి సాధనా సింగ్. తల్లి బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన షీనా, 2008లో తేరే సంగ్ అనే హిందీ చిత్రంతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అనంతరం, తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, బిందాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. బిందాస్ ఆమెకు తొలి తెలుగు చిత్రం కావడంతో, ఈ సినిమా విజయం ఆమె కెరీర్‌కు ప్లస్ అయ్యింది. బిందాస్ తర్వాత షీనా షాహాబాది పలు తెలుగు చిత్రాలలో నటించారు. తొలిసారి చిత్రంలో నటించిన ఆమె, తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు సినిమాలో కూడా కనిపించారు. ఆ తర్వాత యాక్షన్ 3D, నువ్వే నా బంగారం, రాజశేఖర్ గెడ్డం గ్యాంగ్ వంటి చిత్రాలలో నటించి, తనదైన ముద్ర వేశారు. అయితే, 2015 తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇది కూడా చదవండి :
వరుసగా 15 ఫ్లాపులు.. సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చిత్రాలు
తెలుగు చిత్రాలకు దూరమైనప్పటికీ, షీనా షాహబాది తన కెరీర్‌ను హిందీ టీవీ సిరీస్‌లలో, ఇతర భాషా చిత్రాలలో కొనసాగించారు. కన్నడలో సూపర్ స్టార్ యష్ హీరోగా వచ్చిన రాజధాని చిత్రంలో నటించారు, ఇది తెలుగులో రాజధాని రౌడీగా డబ్ అయ్యింది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి చూస్తే, సినీ రంగ ప్రవేశానికి ముందే 2007లో వైభవ్ గోరే అనే వ్యక్తిని వివాహం చేసుకుని, అదే ఏడాది విడాకులు తీసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో దీనిని తన జీవితంలో జరిగిన అతి పెద్ద పొరపాటుగా ఆమె పేర్కొన్నారు. ఈ అనుభవం తర్వాత కూడా ధైర్యంగా సినీ కెరీర్‌ను కొనసాగించారు. ప్రస్తుతం షీనా షాహబాది సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉన్నారు. ఆమె తన జీవిత విశేషాలను, లేటెస్ట్ ఫోటోలను తరచుగా తన అభిమానులతో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టులను బట్టి, ఆమె మరొకరిని వివాహం చేసుకుని, ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆమె తన ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తుండటం విశేషం. ఆమె పంచుకుంటున్న లేటెస్ట్ ఫోటోలు కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంటూ వైరల్‌గా మారుతున్నాయి.
ఇది కూడా చదవండి :
ఆ హీరో మామూలోడు కాదు.. అతను చేసింది చూసి మాకు మైండ్ పోయింది
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




