పెళ్ళైన అందాల వడ్డింపులో తగ్గనంటున్న మహానటి కీర్తి సురేష్..

27-09-2026

Pic credit - Instagram

Phani Ch

మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన నటన తో చిన్న నుండి పెద్ద వరకు అందరి హృదయాల్లో చోటు సంపాదించుకుంది.

కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఇక త‌న సొంత భాష‌ మలయాళ 'గీతాంజలి' మూవీతో క‌థానాయిక‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో కీర్తి సురేష్ రామ్ పోతినేని హీరోగా  నటించిన నేను శైలాజా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.. తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది

తెలుగులో కాస్త గ్యాప్‌తో పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.

తరువాత మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీలో సావిత్రి పాత్ర‌ లో నటించి తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది  ఈ చిన్నది.

ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ లోని దాదాపు అందరి టాప్ హీరోల సరసన నటించింది.