అక్క తోపు హీరోయిన్.. చెల్లెలు నెట్టింట క్రేజీ ఫోటోస్..
Rajitha Chanti
Pic credit - Instagram
27 September 2026
నటి శోభిత ధూళిపాళ చెల్లెలు సమంత ధూళిపాళ నిత్యం సోషల్ మీడియాలో విభిన్నమైన ఫోటోషూట్లతో వార్తల్లో నిలుస్తుంటారు.
తాజాగా సమంత సాంప్రదాయబద్ధమైన ఎరుపు రంగు చీరలో దిగిన సరికొత్త ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో, ఆటోలో ప్రయాణిస్తూ సమంత ఈ ఫోటోషూట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఎరుపు రంగు కాటన్ చీరను ధరించి, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఎంతో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో ఆమె కనిపిస్తున్నారు.
ఎంతో సహజంగా, స్వచ్ఛమైన చిరునవ్వుతో సమంత ఇచ్చిన పోజులు ట్రెడిషనల్ ఫ్యాషన్ ప్రియులను మైమరపిస్తున్నాయి.
మోడల్ , హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అక్క శోభిత తరహాలోనే, సమంత కూడా తనదైన శైలిలో అంద చందాలతో అలరిస్తున్నారు.
వృత్తిరీత్యా వైద్యురాలైన (డాక్టర్) సమంతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినీ గ్లామర్‌కు దూరంగా ఉన్నప్పటికీ,
ఆమెలోని ఫ్యాషన్ సెన్స్, చీరకట్టులోని నాజూకుతనం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్