AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ant control: చంపాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా చీమలను తరిమికొట్టండి!

చీమలు.. ఇవి చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ.. కొన్ని సార్లు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఇంట్లోని నిల్వ చేసిన ఆహారంతో పాటు చిరు దాన్యాలు, చక్కెర వంటి వాటిని నాశనం చేస్తాయి. అయితే వీటిని తరిమికొట్టేందుకు జనాలు మార్కెట్‌లొ దొరికే రకరకాల పౌడర్‌లను వాడుతారు. కానీ వీటి వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చీమలను సహజంగా ఎలా తరిమికొట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

Ant control: చంపాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా చీమలను తరిమికొట్టండి!
Natural Ant Repellent
Anand T
|

Updated on: Sep 27, 2026 | 10:42 PM

Share

కొన్ని సార్లు సడెన్‌గా ఇంట్లో చీమలు పెద్ద క్యూ కట్టి వస్తూ ఉంటాయి. ఇవి ప్రతి ఇంట్లో జరిగే సీన్.. అయితే ఇంట్లో ఎక్కడైనా ఆహారం పడిపోయిందేమో అందుకే చీమలు ఇంట్లోకి వచ్చాయని అందరూ అనుకుంటారు. కానీ చీమలు ఆహారం కోసం మాత్రమే వంటగదిలోకి రావు. అవి చిత్తడి వాతావరణానికి ఆకర్షితమవుతాయి. ఆహారం లేదా నీరు దొరికే మార్గం సులువుగా ఉంటే, అవి మళ్లీ మళ్లీ అదే దారిలోనే వస్తుంటాయి. మొదటి వచ్చిన చీమలు వదిలి వెళ్లే ప్రత్యేకమైన వాసనను బట్టి ఇతర చీమలు కూడా అదే మార్గంలో వస్తాయి.

చీమలు ఇంట్లోకి రాకుండా ఏం చేయాలి

అయితే ఇంట్లో చీమల బెడద నుంచి ఉపశమనం పొందాలంటే.. అవి ఏ మార్గం గుండా ఇంట్లోకి వస్తున్నాయో మొదట మీరు తెలుసుకోవాలి. చీమలు ముఖ్యంగా వంటగది మూలలు, పగుళ్ల నుంచి వస్తుంటాయి. కాబట్టి ఆ చిన్న పగుళ్లను క్లీనింగ్ లిక్విడ్ లేదా సబ్బు నీటితో తరచుగా శుభ్రం చేయండి. వాటి గుండా చీమలు వస్తున్నట్టు కనిపిస్తే ఆ ప్రాంతాన్ని నీటితో పూర్తి శుభ్రం చేయండి.

అలాగే మీరు ఇంట్లో ఆహారాన్ని ఎక్కడ పడితే అక్కడ అస్సలూ పడేయకండి.. అంతేకాదు పిండి, పంచదార, పప్పులు, చిరుధాన్యాలు వంటి వాటిని గాలి చొరబడని డబ్బాల్లో మాత్రమే ఉంచండి. స్వీట్‌లు వంటి ఆహారాలను ఎప్పుడూ తెరిచి ఉంచవద్దు.. వాటిని వాసనను బట్టి కూడా చీమలు ఇంట్లోకి వచ్చే అవాకశం ఉంటుంది. అలాగే కిచెన్లో ఎక్కవగా చెత్తను స్టోర్ చేసుకోవద్దు.. ఈ చెత్త నుంచి వచ్చే వాసన చీమలను ఈజీగా ఆకర్షిస్తుంది. కాబట్టి డస్ట్‌బిన్‌ను ఎప్పటికప్పుడూ క్లీన్‌గా ఉంచుకోండి.. లేదంటే దాన్ని ఎల్లప్పుడూ మూత గట్టిగా మూసి ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లోకి చీమలు రాకుండా అడ్డుకోవచ్చు.

చీమలను తరిమికొట్టే పవర్ ఫుల్ చిట్కాలు

అయితే పొరపాటు ఇంట్లోకి చీమలు వస్తే.. వాటిని సహజంగా మీరు తరిమికొట్టవచ్చు. ఇందుకోసం ఒక బకెట్‌ నీటిలో కొద్దిగా నిమ్మరసం వేసి ఆ నీటిని చీమలు తిరిగే ప్రాంతలో చిలకరించండి. నిమ్మరసం వాసన చీమలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో వెంటనే చీమలు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. అలా కాదంటే.. తెల్ల వెనిగర్, నీటిని సమాన పరిమాణంలో తీసుకొని ఒక స్ర్రే బాటిల్‌లో నింపి.. చీమలు తిరిగే ప్రాంతంలో స్ర్రే చేయండి. ఇలా చేసినా కూడా చీమలు పారిపోతాయి.

చీమలను తరిమికొట్టే మరో పవర్ ఫుల్ చిట్కా ఏమంటంటే.. దాల్చిన చెక్క దీని నుంచి వచ్చే ఘాటైన వాసన కారణంగా చీమలు దరిదాపుల్లోకి కూడా రావు. కాబట్టి దీన్ని చీమలు తిరిగే ప్రాంతాల్లో ఉంచితే.. క్షణాల్లో అక్కడి నుంచి చీమలు వెళ్లిపోతాయి. మిరియాల పొడి కూడా చీమలు తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం చీమలు తిరిగే ప్రాంతంలో కాస్త మిరియాల పొడి చల్లండి. దెబ్బకు చీమలు పారిపోతాయి. ఈ సింపుల్ చిట్కాలతో చీమలను చంపకుండానే ఈజీగా తరిమికొట్టవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us