AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranabaali Movie: రణబాలి నుంచి క్రేజీ అప్డేట్.. నాలుగు ఎపిసోడ్స్‏తో డాక్యుమెంట్ సిరీస్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా రణబాలి. గీత గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్స్ తర్వాత విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ వినూత్న ప్లాన్ తో ముందుకొచ్చారు.

Rajitha Chanti
| Edited By: |

Updated on: Oct 17, 2026 | 9:03 PM

Share
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంట నటిస్తున్న తాజా పిరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం 'రణబాలి'. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విజయదశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 'ఎందయ్యా సామి' పాట మంచి ఆదరణ పొందిన నేపథ్యంలో, మేకర్స్ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చారు.

1 / 5
సాధారణంగా సినిమాల ప్రమోషన్లు అంటే టీజర్లు, ట్రైలర్లు, సాంగ్స్‌కే పరిమితమవుతాయి. కానీ 'రణబాలి' టీమ్ దానికి భిన్నంగా ఆలోచించి 'రణబాలి: నెవర్ ఫర్గెట్ - ది ట్రూత్' పేరుతో నాలుగు ఎపిసోడ్ల ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను ప్రకటించింది. దాదాపు రెండేళ్ల పాటు లోతైన పరిశోధన చేసి, చరిత్ర పుటల్లో కనుమరుగైపోయిన 150 సంవత్సరాల క్రితం నాటి నిజాలను వెలికితీయడమే ఈ డాక్యుమెంటరీ ముఖ్య ఉద్దేశమని చిత్రబృందం తెలిపింది.

2 / 5
"మనకు చెప్పబడిన చరిత్ర ఒకటైతే.. నిజంగా జరిగిన దారుణం మరొకటి" అనే కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌ను యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సిరీస్‌లోని 4 ఎపిసోడ్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఎపిసోడ్ 1: 'ది ఫామైన్ వి ఫర్గోట్' (సెప్టెంబర్ 28): బ్రిటీష్ పాలనలో జరిగిన కృత్రిమ కరువు , మానవ నిర్మిత విధ్వంసంపై ఆధారపడి ఉంటుంది.

3 / 5
ఎపిసోడ్ 2: 'ది హిస్టరీ వి ఫర్గోట్' (సెప్టెంబర్ 30): నాటి సమాజం ఎదుర్కొన్న పరిస్థితులు , పరిణామాలను వివరిస్తుంది. ఎపిసోడ్ 3: 'ది మెన్ వి ఫర్గోట్' (అక్టోబర్ 2): తెల్లదొరల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మరుగునపడిన వీరుల కథనం. ఎపిసోడ్ 4: 'ది లాస్ట్ లోడ్': దీనికి సంబంధించిన ప్రసార తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

4 / 5
ఈ డాక్యుమెంటరీ సిరీస్ ద్వారా సినిమా బ్యాక్‌డ్రాప్‌లోని అసలు హిస్టరీని వివరిస్తూనే, షూటింగ్ బిహైండ్ ద సీన్స్ (BTS) దృశ్యాలను కూడా మేకర్స్ పంచుకోనున్నారు. విజయ్ దేవరకొండ ,రాహుల్ సాంకృత్యన్ కాంబోపై ఇప్పటికే టాలీవుడ్‌లో ఉన్న భారీ అంచనాలను ఈ వినూత్న డాక్యుమెంటరీ ప్రచారం మరింత రెట్టింపు చేస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.

5 / 5
Follow Us