AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. ఇక చిరంజీవి కూడా అభిమానులనే తన కుటుంబంగా భావిస్తారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఫ్యాన్స్ పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకుంటూనే ఉంటారు.

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2026 | 10:07 AM

Share

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులో ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్స్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్నిఅందుకుంది. ఈ సినిమాతో చిరంజీవి, బాబీ కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఓ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విలన్ గా నటిస్తా అని.. అదే నా డ్రీమ్ అని చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి :

బుర్రపాడు మావ..! జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు ఒకప్పుడు హీరోగా, ఆతర్వాత సహాయక పాత్రలు, ఆతర్వాత విలన్ గా నటించాడు. ఆయనే ఎవరో కాదు నటుడు శివాజీ. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఆతర్వాత సహాయక పాత్రలు చేశారు. ఆతర్వాత సెకండ్ హీరోగా..క్రమంగా ప్రధాన పాత్రలు చేసి మెప్పించాడు. అయితే ఆతర్వాత శివాజీకి ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చింది. ఆ మధ్య రాజకీయాల్లోనూ కనిపించారు. ఇక చాలా కాలం తర్వాత బిగ్ బాస్ లో కనిపించారు. బిగ్ బాస్ గేమ్ షోతో శివాజీకి మరోసారి మంచి క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన 90’s బయోపిక్ సిరీస్ లో నటించి మెప్పించారు.

ఇది కూడా చదవండి :

వరుసగా 15 ఫ్లాపులు.. సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చిత్రాలు

నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు శివాజీ. కోర్ట్ సినిమాలో మంగపతి పాత్రలో అదరగొట్టారు. కోర్ట్ సినిమా తర్వాత శివాజీ పేరు మరోసారి ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. రీసెంట్ గా లెనిన్ సినిమాలో నటించారు శివాజీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కష్టకాలంలో ఎదురైన అనుభవాలతో పాటు మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుంచి మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన అభిమానిని అని అన్నారు శివాజీ. మాస్టర్ సినిమాలో ఆయనతో కలిసి నటించా.. ఆ సినిమా సమయంలో నేను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. ఆ సమయంలో చిరంజీవి పిలిచి నా చేతిలో పదివేల రూపాయల నోట్ల కట్ట పెట్టారు. ఆ సంఘటనే నాలో సేవాభావాన్ని పెంచింది. ఇప్పటికీ ఇతరులకు చేతనైన సాయం చేస్తున్నానంటే మెగాస్టారే స్పూర్తి. నాజీవితంలో ఆతిపెద్ద కోరిక మెగాస్టార్ చిరంజీవికి విలన్ గా నటించడమే.. అని చెప్పుకొచ్చారు శివాజీ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఆ హీరో మామూలోడు కాదు.. అతను చేసింది చూసి మాకు మైండ్ పోయింది

Chiranjeevi, Shivaji

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us