Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
Rohit Sharma: ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి జట్టు పగ్గాలను స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు అప్పగించింది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హిట్‌మ్యాన్ తొలిసారి స్పందించాడు. జట్టులో ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నాడో వెల్లడించాడు. అతడి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Rohit Sharma: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు అదిరిపోయే వార్త అందించింది. జట్టు కెప్టెన్‌గా మరోసారి రోహిత్ శర్మను నియమించింది. నవంబర్ 27, శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిన నేపథ్యంలో కొత్త కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న ముంబై.. చివరకు తమ విజయవంతమైన మాజీ సారథి రోహిత్ వైపే మొగ్గు చూపింది. రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఇది రెండో ఇన్నింగ్స్. గతంలో 2013లో జట్టు పగ్గాలు చేపట్టిన అతడు.. ముంబైకి ఏకంగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. ఇప్పుడు మరోసారి జట్టును విజయపథంలో నడిపించే బాధ్యతను స్వీకరించాడు.
మళ్లీ కెప్టెన్‌గా ఎలా మారాడు? రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత రోహిత్ శర్మ జతిన్ సప్రూతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి దారితీసిన పరిస్థితులను వివరించాడు. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు నిరాశలో ఉందని రోహిత్ తెలిపాడు. ఆ సమయంలో జట్టు యజమాని ఆకాష్ అంబానీ తనకు ఫోన్ చేసి.. మరోసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అని అడిగినట్లు వెల్లడించాడు.
ఎక్కువమంది చదివినది: Mohammed Siraj: 6 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన మహమ్మద్ సిరాజ్.. అదేంటంటే?
ఆ తర్వాత ఇద్దరూ కలిసి సమావేశమై జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై చర్చించుకున్నట్లు చెప్పాడు. మొదట్లో కెప్టెన్సీ తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనని భావించినప్పటికీ.. ఆ తర్వాత ఆలోచించి అంగీకరించినట్లు వివరించాడు.
“ముంబై ఇండియన్స్ విఫలమవుతోంది. ఒకరోజు ఆకాష్ నాకు ఫోన్ చేశాడు. మేమిద్దరం కలుసుకుని జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై చర్చించుకున్నాం. జట్టుకు కెప్టెన్‌గా ఉండటానికి సిద్ధంగా ఉన్నావా అని ఆయన అడిగారు” అని రోహిత్ వెల్లడించాడు.
“మొదట్లో నేను సిద్ధంగా లేనని అనుకున్నాను. కానీ ఇంటికి వెళ్లి మరోసారి ఆలోచించాను. ప్రస్తుతం ఈ జట్టుకు సరైన దిశానిర్దేశం అవసరమని నాకు అనిపించింది. ఆ బాధ్యత నాదైతే సంతోషంగా స్వీకరిస్తానని నిర్ణయించుకున్నాను” అని హిట్‌మ్యాన్ చెప్పాడు. “ఇది మనం నిర్మించుకున్న జట్టు. ఇప్పుడు మరోసారి ఈ సవాలును స్వీకరించాల్సిన సమయం వచ్చిందని భావించాను” అని రోహిత్ తన నిర్ణయం వెనుక కారణాన్ని వివరించాడు.
ఐపీఎల్ 2027లో రోహిత్ శర్మ ఎజెండా ఇదే..!
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో మొదట ఎలాంటి మార్పులు తీసుకొస్తావని రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీనికి హిట్‌మ్యాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆటను ఆస్వాదించాలని, ఉత్సాహంగా ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అదే సమయంలో ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించడం వెనుక ఉన్న బాధ్యతను కూడా ప్రతి ఆటగాడు అర్థం చేసుకోవాలని స్పష్టం చేశాడు.
ఎక్కువమంది చదివినది: Team India: ముగ్గురు భారత ఆటగాళ్లకు షాక్.. వన్డే జట్టులో ఇకపై నో ఎంట్రీ..?
“ట్రోఫీ గెలవడం అనేది మా అంతిమ లక్ష్యం. కానీ అంతకంటే ముందు ప్రతి ఒక్కరూ సరదాగా ఉండాలి. ఆటను ఆస్వాదించాలి. ఉత్సాహంగా ఉండాలి. అదే సమయంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు మనపై ఎంత బాధ్యత ఉందో కూడా అర్థం చేసుకోవాలి” అని రోహిత్ పేర్కొన్నాడు. దీంతో ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్‌ను మళ్లీ ఛాంపియన్‌గా నిలబెట్టడమే లక్ష్యంగా రోహిత్ శర్మ సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




