AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

జక్కన్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా.. సినిమాకు బోలెడంత టైం తీసుకున్నా.. అది రిలీజ్ అయ్యాక రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని చెప్పొచ్చు. టాలీవుడ్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళి‌దే. ఒక్క ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచమంతా ప్రస్తుతం రాజమౌళి సినిమాల కోసం ఎదురుచూస్తోంది.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది
Rama Rajamouli
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2026 | 10:50 AM

Share

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాను తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా విడుదల చేస్తామని ఇప్పటికే జక్కన్న అనౌన్స్ చేశాడు. అలాగే ఈ సినిమాను మునుపెన్నడూ చూడని విధంగా రూపుదిద్దుతున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్, టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు వివిధ గెటప్స్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ రాముడిగా కనిపించనున్నాడని రాజమౌళి హింట్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి సతీమణి రామ రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాజమౌళి  పనితీరు, వ్యక్తిత్వం గురించి రామ రాజమౌళి మాట్లాడారు. ఈగ సినిమా మేకింగ్ వెనుక ఉన్న వాస్తవాలు, రాజమౌళి శైలి గురించి ఆమె వివరించారు.

ఇది కూడా చదవండి :

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు

ఈగ సినిమా మొదట కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని భావించిన చిన్న ప్రాజెక్ట్ అని..  అయితే, కథ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, దాని పరిధి పెరిగి, చివరికి రెండు సంవత్సరాలు పట్టిందని తెలిపారు. ప్రారంభంలో అనుకున్న ప్రణాళికలు మారాయని, షూటింగ్ మొదలైన తర్వాత విజువల్స్ పట్ల సంతృప్తి లేక, సెంథిల్ తో కలిసి మళ్లీ మొదటి నుంచి పని ప్రారంభించాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈగ తర్వాత ప్రభాస్‌తో చేయాల్సిన సినిమా అప్పటికే ఖరారై ఉన్నప్పటికీ, ఈగ ప్రాజెక్ట్ మధ్యలో దూరిందని, అది రాజమౌళిని ఎంతగానో ఆకర్షించిందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి :

Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్

రాజమౌళి పనితీరు గురించి మాట్లాడుతూ, ఆయనకు విశ్రాంతి తీసుకోవడం తెలియదని రామ రాజమౌళి స్పష్టం చేశారు. “ఆయన మనస్సు రిలాక్స్ అవ్వదు. శరీరానికి విశ్రాంతి అవసరం తప్ప, ఆయన ఆలోచనలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి” అని అన్నారు. సెలవుల్లో ఉన్నప్పుడు కూడా కొత్త కథలు, సీన్‌ల గురించి చర్చించడం ప్రారంభిస్తారని, తనతోనే మొదట ఆలోచనలు పంచుకుంటారని ఆమె వివరించారు. పనిలో పూర్తిగా లీనమైనప్పుడు, రాజమౌళి వస్తువులు, ఆహారం, చివరికి తన గురించి తాను కూడా మర్చిపోతారని, కొన్నిసార్లు ఇతరుల వస్తువులను పొరపాటున తనతో తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని సరదాగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

బాప్రే బాప్..! ఇదెక్కడి సిరీస్ రా మావ.. మెంటలెక్కిస్తుంది..!! ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us