AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు

శ్రీహరి.. తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అవసరం లేని పేరు. స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తర్వాత నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా రాణించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీహరి ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల్లోనూ నటించారు.

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు
Srihari
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2026 | 10:26 AM

Share

నటి డిస్కో శాంతి, రియల్ స్టార్ శ్రీహరి సతీమణి, తమ కుటుంబ జీవితం, శ్రీహరి దానగుణం గురించి ఆత్మీయంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శ్రీహరి ఇంటికి ఎవరైనా వస్తే వారికి సాయం చేయకుండా పంపేవారు కాదని ఆమె గుర్తుచేసుకున్నారు. రాత్రి 2-3 గంటల వరకు షూటింగ్ ఉన్నప్పటికీ, ఇంటికి వచ్చే అతిథులతో గడిపేవారని తెలిపారు డిస్కో శాంతి. శ్రీహరి తన సంపాదన మొత్తాన్ని దానధర్మాలకే ఖర్చు చేసేవారని, ఆ విషయంలో ఆయనకు ఏమాత్రం సంకోచం ఉండేది కాదని డిస్కో శాంతి అన్నారు.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

ఎవరు వచ్చి ఏం అడిగిన శ్రీహరి దానం చేసేవారు. అయితే శ్రీహరి ఆస్తులను సగం పైగా కొందరు కాజేశారు. క్లోజ్ ఫ్రెండ్స్ ఆస్తిలో సగం పైగా కొట్టేశారు అని డిస్కో శాంతి తెలిపారు. నన్ను ఏ మార్చి.. ఇక్కడ నాకు ఎవ్వరూ పెద్దగా తెలియదు అని నన్ను మోసం చేశారు. నా నగలన్నీ తాకట్టుపెట్టుకోవాల్సి వచ్చిందని శాంతి తెలిపారు. అయితే, ఆయన దానశీలత వల్ల తమ కుటుంబానికి ఎలాంటి లోటు రాలేదని డిస్కో శాంతి స్పష్టం చేశారు. “నా పిల్లలు వెళ్లి భిక్షం ఎత్తుకోలేదు కదా. ఫర్నిచర్స్ అన్ని బానే ఉంది కదా.” అని ఆమె అన్నారు. శ్రీహరి ఇచ్చిన వరం వల్లే తాము ఆర్థికంగా నిలదొక్కుకున్నామని ఆమె అన్నారు. ఆదాయ పన్ను గురించి శ్రీహరితో తాను చర్చించినప్పటికీ, ఆయన ఇతరులకు సహాయం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పారు.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

శ్రీహరి గనుక బతికుంటే ఐదు ఆరు ఇళ్లు, పది పదిహేను కార్లతో మరింత ఉన్నత స్థాయిలో ఉండేవారని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, శ్రీహరి మంచి మనస్సు, దానగుణమే తమకు శాశ్వతమైన ఆస్తిగా మిగిలిందని డిస్కో శాంతి అన్నారు. అలాగే శ్రీహరి చనిపోయిన తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు. సొంత వాళ్లు కూడా శ్రీహరి చనిపోయిన తర్వాత ఎవ్వరూ రాలేదు. నా అన్న తమ్ముళ్లు మాత్రమే నన్ను చాలా కేర్ గా చూసుకున్నారు. నాకు ఆరోగ్యం బాలేకున్నా కూడా నన్ను చూడటానికి ఎవ్వరూ రాలేదు. శ్రీహరి కుటుంబం నన్ను దూరంగా పెట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us