AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ ఇచ్చిన ఐడియాతోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. లేకపోతే తేడా కొట్టేది

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. ‘ఫౌజీ’, స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి2’.. ఇలా చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు ప్రభాస్. వీటిలో ఫౌజీ సినిమా మొదట రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాడి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభాస్ ఇచ్చిన ఐడియాతోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. లేకపోతే తేడా కొట్టేది
Prabhas
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2026 | 7:53 AM

Share

ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి డార్లింగ్ సినిమా గురించిన పలు ఆసక్తికర, అరుదైన విషయాలను వెల్లడించారు. ఈ చిత్రానికి దర్శకుడు కరుణాకరన్ నేతృత్వంలో నటీనటులు, టెక్నీషన్స్ ఎంత అంకితభావంతో పనిచేశారో ఆయన వివరించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు కరుణాకరన్ అసాధారణమైన అంకితభావం కలిగిన వ్యక్తి అని, ఆయనకు అనుకూలంగా తాను చాలా సినిమాలను పక్కనపెట్టి డేట్స్ సర్దుబాటు చేశానని తెలిపారు. కరుణాకరన్‌తో కలిసి పని చేసే ప్రతి క్షణం ఒక విభిన్నమైన అనుభవం అని పేర్కొన్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ వంటివారు కూడా ఎంత ఉత్సాహంగా, రోజూ ఉదయమే లేచి షూటింగ్‌కు సిద్ధంగా ఉండేవారో వివరించారు.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

కేవలం ప్రధాన నటులే కాకుండా, కృష్ణ భగవాన్ గారు, పోసాని కృష్ణమురళి గారు వంటి సీనియర్ నటులు కూడా సినిమా పట్ల అద్భుతమైన సహకారాన్ని అందించారని శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. కృష్ణ భగవాన్ మూడు రోజుల గ్యాప్ ఉన్నా హైదరాబాద్ వెళ్లకుండా లొకేషన్‌లోనే గడిపారని, పోసాని గారు కూడా ఒక గంట ఎక్కువైనా సరే రేపు పొద్దున్న ఫ్లైట్‌కు వెళ్ళిపోతాను అని చెప్పి, సినిమా కోసం ఎంతో సహకరించారని తెలిపారు. ఈ విధమైన సహకారం వల్లే అప్పటికప్పుడు అనుకున్న మార్పులు సులభంగా జరిగాయని, కథ అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా పూర్తి కాగలిగిందని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ.. కేవలం డబ్బు కోసమే కాకుండా, మంచి బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తాను ఏ ప్రాజెక్టులోనైనా సంతోషంగా, తృప్తిగా పనిచేయాలని కోరుకుంటానని, అందుకే కొంత మొత్తంలో సర్దుబాటు చేసుకుంటానని వివరించారు. తనకు ఎంత రావాలి, ఎంత తగ్గించుకున్నాను అన్నది కూడా గుర్తులేదని, తన ఆలోచనంతా సినిమా విజయానికే అని ఆయన తెలిపారు.. డార్లింగ్ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ లో హీరో విలన్‌కు ఒక కథ చెప్పే సన్నివేశం గురించి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ సమయంలో తాను ప్రేక్షకులు మోసపోతున్నారని, విలన్‌కు కాకుండా ప్రేక్షకులకు అబద్ధం చెప్పినట్లవుతుందని దర్శకుడికి సూచించానని తెలిపారు. ప్రభాస్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకొని, వెంటనే డైలాగ్‌ను “ఏదో కథ చెప్పడం కాదురా, ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమను కథగా మార్చి చెప్పాను” అని మార్చారని, ఆ మార్పుసినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయని ఆయన అన్నారు. మనసులో అనిపించినది నిర్మొహమాటంగా చెబితే, అది సినిమాకు మేలు చేస్తుందని ఈ అనుభవాలు రుజువు చేశాయని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర