AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడి కూర వండేటప్పుడు ఇవి నాలుగు ఆకులు వేసి తింటే కళ్ళ జోడుతో పనే లేదు

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే చికెన్ కూరను కొత్తగా ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. గరం మసాలా, టమాటాలు వాడకుండా, పుల్లపుల్లగా, కారంగా ఉండే ఈ వంటకంలో వేసే నాలుగు ఆకులు రుచిని పెంచుతాయి. ఇది కంటి చూపు, జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Oct 05, 2026 | 9:51 AM

Share
కావలసిన పదార్థాలు:  చికెన్: 1 కిలో, తాజా కరివేపాకు: 3 కప్పులు, ఉల్లిపాయలు (మీడియం సైజ్): 3 (సన్నగా తరిగినవి),  పచ్చిమిర్చి: 3 టేబుల్ స్పూన్లు (కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్),  అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు,  కారం: 3 టేబుల్ స్పూన్లు (రుచికి తగ్గట్టు), 
ధనియాల పొడి: 3 టేబుల్ స్పూన్లు (వేయించి దంచినది), జీలకర్ర పొడి: 1 టీ స్పూన్ (వేయించి దంచినది), పసుపు: అర టీ స్పూన్
ఉప్పు: 3 టీ స్పూన్లు (రుచికి తగ్గట్టు), నూనె: 150 గ్రాములు, చింతచిగురు (ఎండు లేదా పచ్చి): అర కప్పు (పులుపు కోసం)  గోంగూర, చుక్కకూరను తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు: చికెన్: 1 కిలో, తాజా కరివేపాకు: 3 కప్పులు, ఉల్లిపాయలు (మీడియం సైజ్): 3 (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి: 3 టేబుల్ స్పూన్లు (కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్), అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు, కారం: 3 టేబుల్ స్పూన్లు (రుచికి తగ్గట్టు), ధనియాల పొడి: 3 టేబుల్ స్పూన్లు (వేయించి దంచినది), జీలకర్ర పొడి: 1 టీ స్పూన్ (వేయించి దంచినది), పసుపు: అర టీ స్పూన్ ఉప్పు: 3 టీ స్పూన్లు (రుచికి తగ్గట్టు), నూనె: 150 గ్రాములు, చింతచిగురు (ఎండు లేదా పచ్చి): అర కప్పు (పులుపు కోసం) గోంగూర, చుక్కకూరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా, మూడు కప్పుల తాజా కరివేపాకును శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా ఆరబెట్టాలి. ఇప్పుడు వెడల్పుగా ఉండే పాన్‌లో సరిపడినంత నూనెను వేసి, మంటను దీనిని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కరివేపాకును మాడకుండా, పచ్చిదనం లేకుండా కరకరలాడేలా వేయించాలి. వేగిన తర్వాత స్టవ్ ఆపి, కరివేపాకును పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన కరివేపాకును మిక్సీ జార్‌లో వేసుకుని, నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి, మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని, 1 కిలో చికెన్‌కు సరిపడినంత నూనెను  వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత, సన్నగా తరిగిన మూడు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి, మంట మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కంటిన్యూస్‌గా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత, కూరకు సరిపడినంత ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి. అర టీ స్పూన్ పసుపు కూడా వేసి ఉల్లిపాయలు చక్కగా వేగే వరకు కలుపుకోవాలి.

3 / 5
ఉల్లిపాయలు వేగిన తర్వాత, తినే కారానికి తగ్గట్టుగా మూడు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, వీటిలోని పచ్చిదనం పోయే వరకు ఐదారు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా వడకట్టుకున్న కిలో చికెన్‌ను ఇందులో వేసి, మంటను హై ఫ్లేమ్‌లోకి మార్చి ఐదారు నిమిషాల పాటు కంటిన్యూస్‌గా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల చికెన్ చక్కగా కుక్ అవ్వడమే కాకుండా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఐదారు నిమిషాల పాటు వేయించిన తర్వాత, మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లోకి తగ్గించి నెమ్మదిగా ఉడకనివ్వాలి. కూరలో నీళ్లన్నీ ఇగిరిపోయిన తర్వాత, మూడు టేబుల్ స్పూన్ల కారం, మూడు టేబుల్ స్పూన్ల వేయించి దంచిన ధనియాల పొడి, ఒక టీ స్పూన్ వేయించి దంచిన జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

4 / 5
ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్‌ను ఇందులో వేసి కలపాలి. కూర ఉడకడం కోసం సరిపడినన్ని వేడి నీళ్లు పోసుకుని అంతా చక్కగా కలిపి మూత పెట్టి, మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చికెన్ చక్కగా ఉడికిన తర్వాత, పులుపు కోసం చివర్లో చింతచిగురును వేసుకోవచ్చు. ఎండు చింతచిగురు అయితే అర కప్పు వరకు వేసుకోవాలి. ఒకవేళ చింతచిగురు అందుబాటులో లేకపోతే, సన్నగా తరిగిన గోంగూర లేదా చుక్కకూర వంటివి కూడా వాడుకోవచ్చు. టమాటా వాడాలనుకుంటే, మసాలాను వేసుకోవాలి. పుల్లటి పదార్థాలు వేయడం వల్ల ఈ కూర చాలా రుచిగా ఉంటుంది, దీనికి చెక్క, లవంగాలు, ఇలాచి వంటి గరం మసాలాలు అవసరం ఉండదు. అయితే, మరింత ఫ్లేవర్ కావాలనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. ఎండు చింతచిగురు వేస్తే ఐదారు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. పచ్చి ఆకుకూరలు వాడితే అవి పూర్తిగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువ గ్రేవీతో, అద్భుతమైన రుచితో కూడిన ఈ కరివేపాకు చికెన్ కూర ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

5 / 5
Follow Us
కోడి కూర వండేటప్పుడు ఈ ఆకులు వేసి తింటే కళ్ళ జోడుతో పనే లేదు

ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడు.. 200లకు పైగా సినిమాలు.. చివరకు..

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శిఖర్ ధావన్

అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో భారీ మార్పులు..

రూ.10 లక్షలతో బయటకెళ్లాడు.. కట్ చేస్తే, చెరువు కట్టపై..

అక్టోబర్‌, నవంబర్‌లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు.. షెడ్యూల్

టీమిండియాకు ఫుల్ బిజీ షెడ్యూల్.. 27 రోజుల్లో 2 దేశాలు, 10 టీ20లు

చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..

సీతాఫలానికి కష్టకాలం.. ఎల్‌నినో దెబ్బకు తగ్గిన దిగుబడి..

దుర్గాపూజలో ‘ది జంగిల్ బుక్’ థీమ్.. అమ్మవారి మండపం చూస్తే..