Daddy Movie : డాడీ సినిమాకు 25 ఏళ్లు.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తుందో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని చిత్రాలు మాత్రం కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ అడియన్స్ హృదయాల్లో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలుగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఆ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అలాంటివాటిలో డాడీ ఒకటి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో డాడీ సినిమా ఒకటి. ఈ మూవీ విడుదలై 25 సంవత్సరాలు పూర్తైంది. 2001 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, మెగాస్టార్‌లోని ఓ సున్నితమైన నటుడిని, తండ్రి ప్రేమానురాగాలను అద్భుతంగా ఆవిష్కరించిన సినిమాగా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అప్పట్లో 19 ఏళ్ల వయసున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాలోనే డ్యాన్స్ స్టూడెంట్‌గా తొలిసారి వెండితెరపై కనిపించారు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకంగా కొరియోగ్రఫీ చేయడం విశేషం.
అయితే ‘డాడీ’ సినిమా గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరికీ చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి ‘అక్షిత’ పాత్రే ముందుగా గుర్తుకొస్తుంది. నీలి కళ్లు, చెంపపై ముద్దులొలికే సొట్ట బుగ్గలు, అమాయకత్వంతో కూడిన నటనతో ఆ చిన్నారి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనుష్క మల్హోత్రా. ‘డాడీ’ సినిమాలో నటిస్తున్న సమయానికి ఆమె వయసు కేవలం ఐదేళ్లు మాత్రమే. ‘డాడీ’ తర్వాత అనుష్క తెలుగులో మరే సినిమాలోనూ నటించలేదు. హిందీలో కొన్ని ప్రకటనలు, చిత్రాల్లో కనిపించినప్పటికీ, ఆ తర్వాత చదువుకే తొలి ప్రాధాన్యమిచ్చి రంగుల ప్రపంచానికి పూర్తిగా దూరమైంది. ముంబైలో పుట్టి పెరిగిన అనుష్క, ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో నివసిస్తోంది.
అక్కడే తన ఉన్నత చదువులను విజయవంతంగా పూర్తి చేసిన అనుష్క, ప్రస్తుతం లండన్‌లోని ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థలో ‘మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్’ గా ఉద్యోగం చేస్తోంది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా కార్పొరేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చదువు పూర్తయ్యాక ఆమెకు కథానాయికగా నటించే అవకాశాలు వచ్చినా, నటనపై ఆసక్తి లేకపోవడంతో ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనుష్క, తరచూ తన వ్యక్తిగత విశేషాలను,ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..
డాడీ చైల్డ్ ఆర్టిస్ట్..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..
