PM Modi Mann Ki Baat: పత్తి సాగులో కొత్త ప్రయోగం.. ‘నవ-త్రింజన్’ కార్యక్రమంపై ప్రధాని మోదీ ప్రశంసలు
Mann Ki Baat 139th Episode: మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లో సహజ పత్తి సాగును ప్రోత్సహిస్తున్న ఖేతీ విరాసత్ మిషన్ ప్రయత్నాలను ప్రస్తావించారు. ‘నవ-త్రింజన్’ కార్యక్రమం ద్వారా రసాయనాల వినియోగం లేకుండా పత్తి సాగు, సహజ రంగుల పత్తి ఉత్పత్తిపై దృష్టి సారించినట్లు తెలిపారు. అలాగే మఖానా, ఖాదీ, గిరిజన ఉత్పత్తులు, స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: మన్ కీ బాత్’ 139వ కార్యక్రమంలో.. ప్రధాని మోదీ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. పత్తి సాగు గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. చేనత రంగం ఎంతో వృద్ధి చెందుతుందని తెలిపారు. పంజాబ్‌కు చెందిన ‘ఖేతీ విరాసత్ మిషన్’ అనే సంస్థ సేంద్రీయ, సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడం ప్రారంభించిందని చెప్పారు. ఈ సంస్థ పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో సహజ పత్తి సాగును ప్రోత్సహించడానికి ప్రయత్నించింది.. ఈ కార్యక్రమానికి ‘నవ-త్రింజన్’ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమం కింద ఇక్కడ ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రీయ పత్తిని పండిస్తున్నారని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఇక్కడ సహజ రంగులతో కూడిన పత్తిని కూడా ఉత్పత్తి చేస్తున్నారు, దీనివల్ల దానితో తయారైన నూలుకు లేదా వస్త్రానికి రంగు వేయడానికి అదనపు రసాయనాలు అవసరం లేదు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఎంతగా దోహదపడుతుందో మీరు ఊహించవచ్చు.
స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత’
‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బీహార్ మఖానా, కర్ణాటక కందిపప్పు ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్లను పొందుతున్నాయని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. గిరిజన కళ గొప్పతనాన్ని చాటిచెప్పే ప్యాకేజింగ్ శైలుల ద్వారా మహారాష్ట్ర గిరిజన ఉత్పత్తులు గుర్తింపు పొందుతున్నాయి. ఖాదీకి ప్రజాదరణ పెరుగుతోంది.. ఇది మన సంప్రదాయాలను సజీవంగా ఉంచే కళాకారులకు మద్దతునిస్తుంది. మన స్థానిక కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా ‘వోకల్ ఫర్ లోకల్’ను మరింత బలోపేతం చేద్దామంటూ పిలుపునిచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా నిర్వహించే ప్రసిద్ధ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) నిర్వహిస్తారు.. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో తన ఆలోచనలను, కీలక విషయాలను పంచుకుంటారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. అక్టోబర్ నెల ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్ కావడం విశేషం.. ఆకాశవాణి (All India Radio – AIR), దూరదర్శన్ నెట్‌వర్క్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే, ఆకాశవాణి ద్వారా వివిధ ప్రాంతీయ భాషల్లోనూ ఈ కార్యక్రమం అందుబాటులోకి రానుంది.
అయ్యో.. భర్త హగ్ చేసుకోగానే కుప్పకూలిన మహిళ
కేదార్‌నాథ్‌లో మంచు వర్షం.. సెల్ఫీలతో యాత్రికుల సందడి
యువకుడిని కిడ్నాప్ చేసిన దొంగలు.. అతని వద్ద డబ్బులు లేవని!
రుద్రాక్షలో ప్రభాస్ ఫొటో.. కుప్పంలో అభిమాని కళా నైపుణ్యం
తక్కువ ఛార్జీకే రాపిడో బైక్ ఎక్కాడని...ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
