AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెడ్‌రూమ్‌లో బోరు, వంట గదిలో బోరు, మెట్ల కింద బోరు.. హైదరాబాద్‌లో నీటి దందా కథ మామూలుగా లేదుగా..

హైదరాబాద్‌లోని మాదాపూర్ సున్నం చెరువు సమీపంలో అక్రమ నీటి దందా వెలుగులోకి వచ్చింది. నవభారత్‌నగర్‌లో ఇళ్లలో ఏర్పాటు చేసిన బోరుబావులు, భూగర్భ పైపులైన్లపై అధికారులు చర్యలు చేపట్టి 21 అక్రమ బోర్లను తొలగించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని హాస్టళ్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో హైడ్రా చర్యలు చేపట్టింది.

బెడ్‌రూమ్‌లో బోరు, వంట గదిలో బోరు, మెట్ల కింద బోరు.. హైదరాబాద్‌లో నీటి దందా కథ మామూలుగా లేదుగా..
Hyderabad Water Mafia
Shaik Madar Saheb
|

Updated on: Oct 25, 2026 | 1:04 PM

Share

హైదరాబాద్: బెడ్ రూమ్‌లో మంచం కింద బోరు, కిచెన్‌‌లో బోరు, నీళ్ల సంపులో బోరు, మెట్ల కింద చూసినా బోరు.. ఎక్కడ పడితే అక్కడ బోరు వేసి.. అడ్డ దిడ్డంగా పైప్ లైన్లు వేసి.. అక్రమంగా పైప్ కనెక్లన్లతో అడ్డగోలుగా నీటి దందా చేస్తున్న ఉదంతం మాదాపూర్‌లోని సున్నం చెరువులో మరోసారి వెలుగులోకి వచ్చింది. భూమికి చిల్లులు పెట్టి.. భూగర్భ జలాన్ని పీల్చేస్తున్న ముఠాపై అధికారులు ఫోకస్ పెట్టారు. మాదాపూర్‌లోని సున్నం చెరువు పక్కనున్న నవభారత్‌నగర్‌లో శనివారం 21 అక్రమ బోరుబావులను ధ్వంసం చేశారు. సైబరాబాద్‌ నగరపాలక సంస్థ, జలమండలి, విద్యుత్తు, రెవెన్యూ అధికారులతో కలిసి అధికారులు అక్రమ బోరుబావులు, భూగర్భ పైపులైన్లను పెద్దఎత్తున తొలగించారు.

భూగర్భ పైపులైన్లను తవ్వుకుంటూ వెళ్తుంటే.. ఒక్కో పైపు ఒక్కో ఇంటికి దారి చూపింది. ఓ ఇంటి నుంచి మూడు పైపులైన్లు ఫిల్లింగ్‌ కేంద్రానికి కనెక్ట్ చేయబడి ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక.. బెడ్‌రూమ్‌లో మంచం కింద, నీటి సంపులో, మెట్ల కింద, వంట గదిలో.. ఇలా ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసుకుని.. నీటిని అమ్ముకుంటున్నట్లు తేలింది.

సున్నం చెరువు చుట్టుపక్కల నీటిలో ప్రమాదకర లోహాలు ఉన్నట్టు తేలడంతో అక్కడి బోరుబావులను తొలగించేలా గతంలో హైడ్రా ఆదేశాలిచ్చింది. కొన్నాళ్లు మౌనంగా ఉన్న ట్యాంకర్ల యజమానులు.. చెరువు పక్కనున్న కాలనీపై కన్నేశారు. కొన్ని ఇళ్లలో సొంతంగా బోర్లు వేయించారు. అప్పటికే ఉన్న బోరుబావులను లీజుకు తీసుకున్నారు. వాటన్నింటినీ భూగర్భ పైపులైన్లతో అనుసంధానం చేసి రోజంతా నీటిని తోడుతూనే ఉన్నారు. అయ్యప్ప సొసైటీ, బోరబండ, మాదాపూర్, హైటెక్‌సిటీలోని హాస్టళ్లు, హోటళ్లు, వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

10 వేల లీటర్ల ట్యాంకరును రూ.10వేల చొప్పున అమ్ముతున్నారంటే వీళ్ల దందా ఏ రేంజ్‌లో సాగుతుందో ఊహించండి. అక్రమంగా సంపాదించేందుకు కలుషిత నీటిని కూడా సప్లై చేస్తున్నారు నీటి దొంగలు.. సున్నం చెరువులో నీటిమాఫియాపై ప్రస్తుతం హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ బోర్లు, ట్యాంకర్ల దందాపై ఫొటోలతో సహా రిలీజ్ చేసింది హైడ్రా..

అయితే.. మున్ముందు అన్నీ ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

వీడియో చూడండి..

Follow Us
మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారు? దీని వెనుక..
మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారు? దీని వెనుక..
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ అద్భుత లాభాలు.. మెరిసే చర్మానికి
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ అద్భుత లాభాలు.. మెరిసే చర్మానికి
భూగర్భ జలాన్ని పీల్చేస్తున్న ముఠాపై హైడ్రా ఉక్కుపాదం
భూగర్భ జలాన్ని పీల్చేస్తున్న ముఠాపై హైడ్రా ఉక్కుపాదం
పౌర్ణమి నుంచి వీరికి దశ తిరిగే ఛాన్స్..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
పౌర్ణమి నుంచి వీరికి దశ తిరిగే ఛాన్స్..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 సెట్ కాదు.. అశ్విన్ వార్నింగ్
వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 సెట్ కాదు.. అశ్విన్ వార్నింగ్
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నాచెల్లెళ్లు మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నాచెల్లెళ్లు మృతి
16 వేల అడుగుల ఎత్తులో ఆకస్మికంగా పీరియడ్స్..శానిటరీ ప్యాడ్స్ లేవు
16 వేల అడుగుల ఎత్తులో ఆకస్మికంగా పీరియడ్స్..శానిటరీ ప్యాడ్స్ లేవు
ఈ చిత్రంలో మీరు మొదట ఏం చూశారు? పెంగ్వినా.. మనిషి ముఖమా?..
ఈ చిత్రంలో మీరు మొదట ఏం చూశారు? పెంగ్వినా.. మనిషి ముఖమా?..
కోహ్లీ, రోహిత్, బుమ్రాకు నో ప్లేస్..రహానే టెస్ట్ టీమ్ ఇదే
కోహ్లీ, రోహిత్, బుమ్రాకు నో ప్లేస్..రహానే టెస్ట్ టీమ్ ఇదే
నీచు వాసన లేకుండా టేస్టీ చికెన్ కర్రీ.. పాతకాలం నాటి ఫార్ములా..
నీచు వాసన లేకుండా టేస్టీ చికెన్ కర్రీ.. పాతకాలం నాటి ఫార్ములా..