AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువకుడిని కిడ్నాప్‌ చేసిన దొంగలు.. అతని వద్ద డబ్బులు లేవని.. ఏంచేశారో చూడండి!

యువకుడిని కిడ్నాప్‌ చేసిన దొంగలు.. అతని వద్ద డబ్బులు లేవని.. ఏంచేశారో చూడండి!

Phani CH
|

Updated on: Oct 24, 2026 | 6:44 PM

Share

చెన్నైలోని పల్లికరణైలో అజయ్‌ అనే యువకుడిని కిడ్నాప్‌ చేసిన నలుగురు నిందితులు, అతడి మొబైల్‌లోని ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ ద్వారా అప్పు తీసుకునేలా బలవంతం చేసినట్లు సమాచారం. అనంతరం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయించి, అతడి ఫోన్‌ను కూడా లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసినట్లు కథనం పేర్కొంది. ఈ ఘటన మొబైల్‌ యాప్‌ల దుర్వినియోగంపై ఆందోళన కలిగిస్తోంది.

మారుతున్న కాలానికి తగినట్లుగా టెక్నాలజీ మనుషుల జీవితాలను ఎంతో సులభతరం చేసింది. అదే టెక్నాలజీని అడ్డుపెట్టుకుని నేరగాళ్లు కొత్తపుంతలు తొక్కుతున్నారు. ఒకప్పుడు జేబులో డబ్బులు లేకపోతే దొంగలు నిరాశతో వదిలేసి వెళ్లేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో నేరాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దొంగలు కూడా అప్‌డేట్‌ అవుతున్నారు. పాత పద్ధతికి గుడ్‌బై చెప్పి.. కొత్తదారులు వెతుకుతున్నారు. స్మార్ట్‌ యుగంలో స్మార్ట్‌గా దోచేస్తున్నారు. “నీ దగ్గర క్యాష్ లేకపోతే ఏంటి.. మొబైల్ ఉంది కదా! మర్యాదగా యాప్‌లో లోన్ తీసుకొని మాకు ఇవ్వు” అనే స్థాయికి నేరగాళ్ల అప్‌డేట్ అయ్యారు. ఎవరికైనా అత్యవసరంగా డబ్బు అవసరమై అప్పు అడిదితే.. మనదగ్గర డబ్బు లేకపోతే ఇంకెవరి దగ్గరైనా అడిగి ఇవ్వండి అని అడగడం మనం చూసాం కానీ. చెన్నైలో జరగిన ఒక షాకింగ్ ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. టెక్నాలజీని నేరాల కోసం ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారనేదానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. చెన్నైలోని పల్లికరణై ప్రాంతంలో అజయ్ అనే యువకుడు సాధారణ జీవితం గడుపుతున్నాడు. అయితే కొందరు దుండగులు అతడిని టార్గెట్ చేశారు. అజయ్‌ను బలవంతంగా ఒక ఆటోరిక్షాలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని, తనను వదిలేయాలని అజయ్ ప్రాధేయపడ్డాడు. సాధారణ దొంగలైతే అక్కడితో వదిలేసేవారేమో కానీ, వీళ్లు హైటెక్‌ నేరగాళ్లు. అందుకే టెక్నికల్‌గా ఆలోచించారు. యువకుడి చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ను చూసి, డబ్బుల్లేకపోతే ఫోన్‌ ఉందికదా… లోన్‌ యాప్‌లో లోన్‌ తీసుకొని ఇవ్వు అని అజయ్‌ను బెదిరించారు. అతడి మొబైల్ ఫోన్‌లోని ఇన్ స్టంట్ లోన్ యాప్‌ వేసి, దాని ద్వారా లోన్‌కి అప్లై చేయించారు. క్షణాల్లో ఆ యాప్ ద్వారా అజయ్ పేరు మీద లోన్ మంజూరైంది. వెంటనే అతడిని ఒక ఏటీఎం సెంటర్‌కు తీసుకెళ్లి ఆ డబ్బును డ్రా చేయించి తీసుకున్నారు. అంతేకాకుండా, బాధితుడి వద్ద ఉన్న విలువైన సెల్‌ఫోన్‌ను కూడా లాక్కుని పరారయ్యారు. దారుణ ఘటనతో నిర్ఘాంతపోయిన అజయ్‌.. చేసేది లేక నిస్సహాయ స్థితిలో పల్లికరణై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. చెన్నైకి చెందిన సాయి అబూతకీర్ అలియాస్ అబు , ప్రకాశ్ రాజ్ , పూబాలన్ , సంజయ్ లు ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించి నలుగురినీ అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన ఆటోరిక్షాను స్వాధీనం చేసుకుని, నిందితులను న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన ఒక్కటే కాదు, నేడు సైబర్ నేరగాళ్లు, సాధారణ క్రిమినల్స్ ప్రజలను దోచుకోవడానికి రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. టెక్నాలజీ సామాన్యులకు ఎంత వరప్రసాదమో, నేరగాళ్లకు అంతకంటే ఎక్కువ ఆయుధంగా మారుతోంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు పోలీసులమని, సీబీఐ అధికారులమని నమ్మిస్తారు. వీడియో కాల్స్ ద్వారా అమాయకులను గంటల తరబడి బంధించి, భయభ్రాంతులకు గురిచేసి కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటారు. మరికొందరు లాటరీ తగిలిందని, క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లు వచ్చాయని రకరకాల ఫేక్‌ మెసేజ్‌లు, లింక్స్ పంపి.. క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. ఈమధ్య వివిధ సంస్థల పేరిట నకిలీ కాల్స్ చేసి వ్యక్తిగత వివరాలు రాబట్టి క్షణాల్లో ఖాతాలను గుల్ల చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కిడ్నాప్ చేసి మరీ మొబైల్ యాప్‌ల ద్వారా సరికొత్త దోపిడీ సంస్కృతి తెరపైకి వచ్చింది. జేబులో క్యాష్ లేకపోయినా, స్మార్ట్‌ఫోన్ మరియు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు నిమిషాల్లో అప్పు పుట్టే సౌలభ్యాన్ని ఈ దొంగలు తమ నేరాలకు వాడుకుంటున్నారు. ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా అనుమానాస్పదంగా కనిపిస్తే లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. టెక్నాలజీని మనం సౌలభ్యం కోసం వాడాలి తప్ప, అది నేరగాళ్లకు అస్త్రం కాకుండా మన వ్యక్తిగత డేటాను, ఫోన్ భద్రతను కాపాడుకోవడం ఎంతో అవసరం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగితే రూ.2 లక్షలు ఎలా పొందాలి?

గన్‌ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?

దంపతుల రీల్స్‌ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా

ఏనుగులకు స్పెషల్ డైట్.. మైసూర్ దసరా జంబూ సవారీ వెనుక అసలు రహస్యం ఇదే

రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!

Follow Us