AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేదార్‌నాథ్‌లో మంచు వర్షం.. సెల్ఫీలతో యాత్రికుల సందడి

కేదార్‌నాథ్‌లో మంచు వర్షం.. సెల్ఫీలతో యాత్రికుల సందడి

Phani CH
|

Updated on: Oct 24, 2026 | 6:49 PM

Share

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ధామ్‌లో అకస్మాత్తుగా మంచు కురవడంతో పరిసరాలు తెల్లని మంచు దుప్పటి కప్పుకున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరిగినప్పటికీ, దర్శనానికి వచ్చిన భక్తులు మంచుతో నిండిన పర్వతాల అందాలను ఆస్వాదించారు. కొందరు ఈ అద్భుత దృశ్యాలను కెమెరాల్లో బంధించగా, మరికొందరు ఫొటోలు, సెల్ఫీలు దిగారు. మంచు సౌందర్యాన్ని చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంచుతో కప్పబడిన పర్వతాల నడుమ వెలసిన ఈ దివ్యక్షేత్రంలో అకస్మాత్తుగా మంచు కురవడం ప్రారంభమైంది. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే కేదార్‌నాథ్ ధామ్‌లో ఈ పరిణామంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి విపరీతమైన చలి పెరిగింది. మంచు కురుస్తున్నప్పటికీ, పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. సడెన్‌గా మారిన ఈ మిక్స్‌డ్ వెదర్‌ను భక్తులు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు మంచుతో తెల్లగా మెరుస్తున్న అందమైన పర్వతాలు, మరోవైపు కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం చూసేందుకు రెండు కండ్లు చాలవన్నట్లుగా అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. ఈ మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలను చూసి భక్తులు పులకించిపోయారు. ఈ అరుదైన మరియు సుందరమైన దృశ్యాలను కొందరు తమ కెమెరాల్లో బంధిస్తుంటే, మరికొందరు ఉత్సాహంగా ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. చలిని కూడా లెక్కచేయకుండా యాత్రికులు కేదార్‌నాథ్ మంచు సౌందర్యంలో తేలియాడుతున్న ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దైవదర్శనంతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించే అరుదైన అనుభూతిని భక్తులు ఆస్వాదించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎస్‌బీఐ కస్టమర్ల డేటా లీక్ ! పాస్‌వర్డ్స్ మార్చుకోవాలని నిపుణుల సూచన

2027 ప్రపంచకప్‌.. కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై బీసీసీఐ చీఫ్ క్లారిటీ

యువకుడిని కిడ్నాప్‌ చేసిన దొంగలు.. అతని వద్ద డబ్బులు లేవని.. ఏంచేశారో చూడండి!

Follow Us