AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్‌బీఐ కస్టమర్ల డేటా లీక్ ! పాస్‌వర్డ్స్ మార్చుకోవాలని నిపుణుల సూచన

ఎస్‌బీఐ కస్టమర్ల డేటా లీక్ ! పాస్‌వర్డ్స్ మార్చుకోవాలని నిపుణుల సూచన

Phani CH
|

Updated on: Oct 24, 2026 | 6:47 PM

Share

ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. PHPలో గుర్తించిన ప్రమాదకర లోపాలు, ఈముద్ర డిజిటల్‌ సర్టిఫికెట్లలో భద్రతా బలహీనతలు, ఏఐ ఆధారిత హ్యాకింగ్‌ దాడులు చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో ఎస్‌బీఐకి చెందిన 3,897 మంది కస్టమర్ల రికార్డులు బహిర్గతమైనట్లు సమాచారం వెలువడింది. సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్‌ చేయడం, బలమైన పాస్‌వర్డ్‌లు వాడటం, అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండటం ద్వారా డిజిటల్‌ భద్రతను మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వ్యవస్థల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పీహెచ్‌పీలో ప్రమాదకర లోపాలు, భారత డిజిటల్ సర్టిఫికెట్ సంస్థ ‘ఈముద్ర’ సెక్యూరిటీ కీల్లో బలహీనతలు, ఏఐ టూల్స్ ఆధారిత హ్యాకింగ్ దాడులతో పాటు ఎస్‌బీఐ వినియోగదారుల డేటా బహిర్గతం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రపంచంలోని దాదాపు 70 శాతం వెబ్‌సైట్లలో ఉపయోగించే పీహెచ్‌పీ ప్రొగ్రామింగ్‌లో ‘PHP2Shell’ అని పిలిచే రెండు లోపాలను గుర్తించారు. వీటి ద్వారా హ్యాకర్లు వెబ్ సర్వర్లను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉంది. పీహెచ్‌పీ ఫౌండేషన్ దీనికి అత్యవసర అప్‌డేట్‌ విడుదల చేయగా, యూజర్లు వెంటనే సిస్టమ్‌లను అప్‌డేట్ చేసుకోవాలని లేదంటే ఆఫ్‌లైన్‌లో ఉంచాలని ఎన్ఎస్ఏ, ఎఫ్‌బీఐ హెచ్చరించాయి. మరోవైపు, భారతీయ సంస్థ ‘ఈముద్ర’ ఉపయోగించిన 8 ప్రైవేట్ కీలు బలహీనంగా ఉన్నట్లు గుర్తించడంతో యాపిల్, గూగుల్, మొజిల్లా తమ బ్రౌజర్లలో ప్రభావిత సర్టిఫికెట్లను బ్లాక్ చేశాయి. అయితే, వీటి వల్ల ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని, ఒకే సర్టిఫికెట్ వాడుకలో ఉందని ఈముద్ర స్పష్టం చేసింది. మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆధారంగా హ్యాకింగ్ దాడులు పెరిగాయి. ఏఐ సేవలకు అనుసంధానంగా పనిచేసే LiteLLMలో హానికరమైన కోడ్‌ను చొప్పించి డెవలపర్ల డేటాను చోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాతో సంబంధమున్న హ్యాకింగ్ బృందం ఏఐ టూల్స్ ద్వారా కనెక్ట్‌వైజ్ క్లౌడ్ బ్యాకప్‌ను లక్ష్యంగా చేసుకుని ఏకంగా 2,250కి పైగా సంస్థలపై దాడులు చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. వీటన్నింటి మధ్య భారత అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐకి చెందిన 3,897 మంది కస్టమర్ల రికార్డులు బహిర్గతమైనట్లు బ్యాంకు అధికారికంగా ధ్రువీకరించింది. రోజురోజుకూ పెరుగుతున్న ఈ డిజిటల్ దాడుల నేపథ్యంలో ప్రతిఒక్కరూ సాఫ్ట్‌వేర్లను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలని, బలమైన పాస్‌వర్డ్‌లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2027 ప్రపంచకప్‌.. కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై బీసీసీఐ చీఫ్ క్లారిటీ

యువకుడిని కిడ్నాప్‌ చేసిన దొంగలు.. అతని వద్ద డబ్బులు లేవని.. ఏంచేశారో చూడండి!

Follow Us