భర్త పడే కష్టాన్ని చూసి చలించిపోయిన ఓ భార్య, తన ప్రేమను వినూత్నంగా చాటుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన విజయ, టీ స్టాల్ నడుపుతున్న తన భర్త విజయరావు కోసం పది రూపాయల నాణాలు పోగేసి రూ.50,000 సమకూర్చింది. దసరా డిస్కౌంట్తో ఆ డబ్బులతో మోపెడ్ కొనిచ్చి, అతని శ్రమను తగ్గించి ఆదర్శ దంపతులుగా నిలిచారు.