AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 వేల అడుగుల ఎత్తులో ఆకస్మికంగా పీరియడ్స్.. శానిటరీ ప్యాడ్స్ లేకుండానే పర్వతారోహకురాలి తెలివైన జుగాడ్‌!

సాహసయాత్రలు చేసే మహిళలు నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంటారు. ప్రత్యేకించి మంచు కొండలను అధిరోహించే సమయంలో శారీరకంగా ఎదురయ్యే ఇబ్బందులు వర్ణనాతీతం. తాజాగా, ప్రముఖ పర్వతారోహకురాలు యోగేశ్వరి బోహ్రే హిమాలయాలలో పర్వతారోహణ చేస్తున్న సమయంలో తాను ఎదుర్కొన్న ఒక క్లిష్టమైన పరిస్థితిని, దానికి ఆమె చూపిన చొరవను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చనీయాంశం కావడంతో పాటు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

16 వేల అడుగుల ఎత్తులో ఆకస్మికంగా పీరియడ్స్.. శానిటరీ ప్యాడ్స్ లేకుండానే పర్వతారోహకురాలి తెలివైన జుగాడ్‌!
Periods At 16,000 Feet
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2026 | 12:41 PM

Share

సాహసయాత్రలు చేసే మహిళలు నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంటారు. ప్రత్యేకించి మంచు కొండలను అధిరోహించే సమయంలో శారీరకంగా ఎదురయ్యే ఇబ్బందులు వర్ణనాతీతం. తాజాగా, ప్రముఖ పర్వతారోహకురాలు యోగేశ్వరి బోహ్రే హిమాలయాలలో పర్వతారోహణ చేస్తున్న సమయంలో తాను ఎదుర్కొన్న ఒక క్లిష్టమైన పరిస్థితిని, దానికి ఆమె చూపిన చొరవను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చనీయాంశం కావడంతో పాటు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

హిమాలయాలలోని కఠినమైన వాతావరణంలో 16,000 అడుగుల ఎత్తులో పర్వతారోహణ చేస్తున్న సమయంలో ఓ మహిళా అధునాతన తెగువను ప్రదర్శించారు. సముద్ర మట్టానికి దాదాపు 16,000 అడుగుల ఎత్తులో ఉన్న కఠినమైన, మంచుతో కప్పబడిన ప్రాంతంలో యోగేశ్వరి ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో వాతావరణం అత్యంత శీతలంగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. సరిగ్గా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమెకు అకస్మాత్తుగా పీరియడ్స్ ప్రారంభమయ్యాయి. సాధారణంగానే ఆ సమయంలో మహిళలు శారీరక నొప్పులతో ఇబ్బంది పడతారు. కానీ అంత ఎత్తున, ఎటువంటి దుకాణాలు, మౌలిక వసతులు లేని చోట ఆమె వద్ద ఉన్న శానిటరీ ప్యాడ్స్ అప్పటికే అయిపోయాయి.

ఇవి కూడా చదవండి

అయినప్పటికీ యోగేశ్వరి మాత్రం సహనం కోల్పోలేదు. తక్షణ కర్తవ్యంగా తన వద్ద ఉన్న ఫస్ట్-ఎయిడ్ కిట్‌ను పరిశీలించారు. అందులో లభించిన టిష్యూ పేపర్లు, మెడికల్ టేప్‌ను ఉపయోగించి ఒక హోమ్‌మేడ్ శానిటరీ ప్యాడ్ను తయారు చేసుకున్నారు. టిష్యూ పేపర్లను పలు మడతలుగా వేసి, టేప్ సహాయంతో దానిని సురక్షితంగా సెట్ చేసుకుని తన ప్రయాణాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించారు.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ అనుభవాన్ని పంచుకుంటూ, పర్వతాలు మనకు కేవలం ఎక్కడం మాత్రమే కాదు, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆత్మస్థైర్యంతో ఎలా బతకాలో, సమస్యలకు ఎలా పరిష్కారం వెతుక్కోవాలో నేర్పుతాయి అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె సంకల్ప బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి సెల్యూట్ చేస్తున్నారు. పర్వతారోహణ చెక్‌లిస్ట్‌లో పీరియడ్ హైజీన్ కిట్‌ను కూడా తప్పనిసరిగా చేర్చాలని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
16 వేల అడుగుల ఎత్తులో ఆకస్మికంగా పీరియడ్స్..శానిటరీ ప్యాడ్స్ లేవు
16 వేల అడుగుల ఎత్తులో ఆకస్మికంగా పీరియడ్స్..శానిటరీ ప్యాడ్స్ లేవు
ఈ చిత్రంలో మీరు మొదట ఏం చూశారు? పెంగ్వినా.. మనిషి ముఖమా?..
ఈ చిత్రంలో మీరు మొదట ఏం చూశారు? పెంగ్వినా.. మనిషి ముఖమా?..
కోహ్లీ, రోహిత్, బుమ్రాకు నో ప్లేస్..రహానే టెస్ట్ టీమ్ ఇదే
కోహ్లీ, రోహిత్, బుమ్రాకు నో ప్లేస్..రహానే టెస్ట్ టీమ్ ఇదే
నీచు వాసన లేకుండా టేస్టీ చికెన్ కర్రీ.. పాతకాలం నాటి ఫార్ములా..
నీచు వాసన లేకుండా టేస్టీ చికెన్ కర్రీ.. పాతకాలం నాటి ఫార్ములా..
హస్టల్‌ గదిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
హస్టల్‌ గదిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
గజకేసరి యోగంతో ఈ 4 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి!
గజకేసరి యోగంతో ఈ 4 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి!
కాళ్లు పైకి, మొండెం కిందికి కుర్చీపై తలకిందులుగా పోలీస్ అధికారి..
కాళ్లు పైకి, మొండెం కిందికి కుర్చీపై తలకిందులుగా పోలీస్ అధికారి..
స్వదేశీ ఉత్పత్తులను ఆదరించి.. చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోండి
స్వదేశీ ఉత్పత్తులను ఆదరించి.. చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోండి
ఫస్ట్ నైట్ రోజే భర్త చనిపోయి తిరిగి వస్తే..
ఫస్ట్ నైట్ రోజే భర్త చనిపోయి తిరిగి వస్తే..
అద్దంలో చూస్తూ రైఫిల్‌తో పర్ఫెక్ట్ షాట్.. ఈ మహిళ గురి చూస్తే వావ్
అద్దంలో చూస్తూ రైఫిల్‌తో పర్ఫెక్ట్ షాట్.. ఈ మహిళ గురి చూస్తే వావ్