AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూరత్‌లో గోల్డ్ ఘారీ మజాలు.. కిలో రూ. 21,000 ఉన్నా తగ్గేదేలే అంటున్న ప్రజలు!

గుజరాత్ రాజధాని సూరత్ నగరం అంటేనే రుచికరమైన వంటకాలకు, వినూత్న మిఠాయిలకు ప్రసిద్ధి. ఇక్కడ జరుపుకునే సాంప్రదాయ పండుగలలో చాందీ పడ్వా అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ రోజున ఘారీ అనే ప్రత్యేకమైన తీపి పదార్థాన్ని తినడం స్థానికులకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం చాందీ పడ్వా వేళ సూరత్ మిఠాయి మార్కెట్‌లో గోల్డ్ ఘారీ తన రాయల్ లుక్‌తో, భారీ ధరతో వార్తల్లో నిలిచింది.

సూరత్‌లో గోల్డ్ ఘారీ మజాలు.. కిలో రూ. 21,000 ఉన్నా తగ్గేదేలే అంటున్న ప్రజలు!
Surats Gold Ghari Sweet
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2026 | 11:01 AM

Share

గుజరాత్‌లోని సూరత్ నగరంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే చాందీ పడ్వా పండుగ వేళ సాంప్రదాయ తీపి పదార్థమైన గోల్డ్ ఘారీ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ ఖరీదైన తీపి పదార్థం కోసం సూరత్‌తో పాటు దేశ, విదేశాల నుండి అడ్వాన్స్ బుకింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, ఈసారి సాంప్రదాయ రుచులతో పాటు కునాఫా, బ్లూబెర్రీ వంటి 17 రకాల నయా ఫ్యూజన్ ఫ్లేవర్లు కూడా లభిస్తున్నాయి.

ప్రస్తుతం సూరత్ మార్కెట్‌లో గోల్డ్ ఘారీ ధర కిలో రూ. 21,000కి చేరింది. గత సంవత్సరం రూ. 16,000 నుండి రూ. 18,000 వరకు ఉన్న ధర, ఈసారి డ్రై ఫ్రూట్స్, స్వచ్ఛమైన నెయ్యి, బంగారం ధరలు పెరగడంతో ఒకేసారి రూ. 5,000 పెరిగి రికార్డు స్థాయికి చేరింది. అయితే ఈ రికార్డు స్థాయి ధరలు కూడా సూరత్ వ్యాపారుల, ప్రజల ఉత్సాహాన్ని తగ్గించలేకపోయాయి. విశేషమేమిటంటే, పండుగకు ముందే ఈ బంగారు మిఠాయి కోసం దుకాణాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి.

గోల్డ్ ఘారీని కేవలం సాధారణ పదార్థాలతోనే కాకుండా, పైన స్వచ్ఛమైన తినదగిన బంగారు రేకు తో అలంకరిస్తారు. పూర్వ కాలంలో రాజులు, మహారాజులు తమ ఆహారంలో స్వర్ణ భస్మాన్ని ఉపయోగించే శైలి నుండి ప్రేరణ పొంది, ఈ మిఠాయిని తయారు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇది రాజసానికి ప్రతీకగా భావించడంతో పాటు ప్రత్యేక అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి, పండుగను ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది మార్కెట్‌లో కేవలం గోల్డ్ ఘారీ మాత్రమే కాకుండా ఆధునిక ఫ్యూజన్ రుచులు కూడా లభిస్తున్నాయి. ప్రసిద్ధ 24 క్యారెట్ స్వీట్స్ వంటి దుకాణదారులు కునాఫా, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, అంజీర్-అక్రోట్, కేసర్-పిస్తా, చాక్లెట్ చిప్స్ వంటి 17 రకాల కొత్త ఫ్లేవర్లలో ఘారీని అందుబాటులోకి తెచ్చారు. ఇతర నగరాలు, విదేశాల నుండి కూడా ఈ స్వీట్‌కు ఆర్డర్లు వస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ధర ఎంత ఉన్నా తమ సంస్కృతి మరియు రుచుల పట్ల సూరత్ ప్రజలు చూపే మక్కువకు ఈ గోల్డ్ ఘారీ కొనుగోళ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us