వానరం మూగ ప్రేమ! షాపు ఓనర్‌ను ప్రేమతో హత్తుకున్న కొండ ముచ్చు.. వీడియో వైరల్
విచ్చల విడిగా ఇంటర్‌నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తరువాత సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. వాటిలో కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని మనసును హత్తుకునేలా ఉంటాయి. తాజాగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో నెటిజన్ల కంట తడిపిస్తోంది. అదే సమయంలో ప్రజలను కడుపుబ్బ నవ్వుకునేలా చేస్తుంది. ఒక కొండముచ్చు..దుకాణదారుడిని ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఈ అరుదైన ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఒక హృదయాలను హత్తుకునే ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మొబైల్ రిపేరింగ్ షాప్‌లోకి అకస్మాత్తుగా ప్రవేశించిన ఒక లంగూరు కోతి, కౌంటర్ వద్ద కూర్చున్న దుకాణదారుడి దగ్గరకు వెళ్లింది. ఎలాంటి భయం లేకుండా అతని ఒడిలో కూర్చుని, ఎంతో ఆప్యాయంగా గట్టిగా కౌగిలించుకుంది. ఈ అద్భుతమైన దృశ్యం షాప్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డైంది. మూగజీవాల నిష్కల్మషమైన ప్రేమను చాటే ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఒడిశా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అక్టోబర్ 22 సాయంత్రం సమయంలో ఒక మొబైల్ రిపేర్ షాప్‌లోకి హఠాత్తుగా ఒక పెద్ద లంగూరు కోతి ప్రవేశించింది. దుకాణంలో కౌంటర్ దగ్గర కుర్చీలో కూర్చున్న ఓ దుకాణదారుడి వద్దకు ఆ కోతి ఎలాంటి దూకుడు ప్రదర్శించకుండా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడే ఉన్న మరో వ్యక్తిని కూడా పట్టించుకోకుండా, నేరుగా దుకాణదారుడి ఒడికి దగ్గరగా చేరుకుంది.
ఆశ్చర్యకరంగా ఆ లంగూరు తన తలను దుకాణదారుడి ఛాతికి ఆనించి, రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకుంది. దాదాపు 30 సెకన్ల పాటు సాగిన ఈ వీడియోలో ఆ కోతి రెండుసార్లు ఎంతో ఆప్యాయంగా దుకాణదారుడిని హత్తుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా క్రూరంగా లేదా భయపెట్టేలా ప్రవర్తించే వన్యప్రాధులు లేదా కోతులు ఇలా మనుషులతో ప్రేమగా ప్రవర్తించడం చాలా అరుదు. అంతా ఊహించని ఈ పరిణామానికి ఆ షాప్ యజమాని కూడా ఏమాత్రం భయపడలేదు. ఎటువంటి హడావుడి చేయకుండా ఎంతో సంయమనంతో, ప్రశాంతంగా కూర్చుని ఆ మూగజీవి ప్రేమను స్వీకరించాడు.
వీడియో ఇక్కడ చూడండి..
A Shopkeeper got scared when a Monkey walked in, But the Monkey literally Hugged him.
Maybe he just needed a little love. 🥹 https://t.co/SlK7UPOi0l
— Saffron Aura (@Saffron_Aura) October 24, 2026
ఈ మనోహరమైన దృశ్యమంతా షాప్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో భద్రంగా రికార్డైంది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వివిధ సోషల్ మీడియా వేదికలలో ఈ వీడియో షేర్ చేయబడగానే క్షణాల్లో వైరల్ అయింది. ఈ ప్రపంచంలో ప్రేమకు మించిన భాష లేదు, ఇది కచ్చితంగా గత జన్మ బంధం కావచ్చు, మూగజీవాల అమాయకత్వం ఎంతో గొప్పది అంటూ నెటిజన్లు రకరకాల భావోద్వేగ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో మోస్ట్ వాంటెడ్ అండ్ హార్ట్ టచింగ్ వీడియోగా నిలిచింది.




