Coconut Laddu: తక్షణ శక్తితో పాటు ఎముకలకు బాలన్ని ఇచ్చే లడ్డూ.. రోజూ ఒక్కటి తింటే..
మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు మార్కెట్ నుంచి స్వీట్స్ తెప్పించుకునే బదులు.. ఇంట్లోనే ఈజీగా చేసుకునే షాహీ పిస్తా కొబ్బరి లడ్డూ ట్రై చేయండి. కొబ్బరి, జీడిపప్పు, బాదం, పిస్తా ,కండెన్స్‌డ్ మిల్క్‌తో చేసే ఈ స్వీట్ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని చేయడం కూడా చాలా సింపుల్.. కాబట్టి ఇంట్లోనే ఈ షాహీ పిస్తా కొబ్బరి లడ్డూ ఎలా చేయాలో చూద్దాం.

మన తెలుగురాష్ట్రాల్లో ఏవైనా ఫంక్షన్‌లు ఉంటే స్వీట్స్ కచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి సమయంలో ఎప్పుడూ బయటి నుంచి తీసుకురావడం కన్నా.. కాస్త టైం తీసుకొని ఇంట్లోనే మీరు స్వీట్లను చేసుకోవచ్చు. అలాంటి స్వీట్లలో షాహీ పిస్తా కొబ్బరి లడ్డూలు కూడా ఒకటి. కొబ్బరితో చేసే ఈ లడ్డూలు టెస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని తయారు చేయడాని మీరు పెద్దగా కష్టపడాల్సిన పనికూడా లేదు.. తక్కువ పదార్థాలతో చాలా తక్కువ సమయంలో ఈ రెసిపీని చేయవచ్చు. మీరి దీనికి ఏం ఏం పదార్థాలు కావాలి, ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం.
కావలసిన పదార్థాలు:
ఫుడ్ ఎక్స్‌పర్ట్ రీనా కన్వర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ లడ్డూల తయారీకి పదార్థాలు
- తురిమిన ఎండు కొబ్బరి – 2 కప్పులు
- కండెన్స్‌డ్ మిల్క్ – అర కప్పు
- జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
- బాదం – 2 టేబుల్ స్పూన్లు
- పిస్తా – 2 టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి – అర టీస్పూన్
- గార్నిషింగ్ కోసం – కొద్దిగా కొబ్బరి పొడి, సన్నగా తరిగిన పిస్తా
షాహీ పిస్తా కొబ్బరి లడ్డూ తయారీ విధానం:
స్టెప్-1: ఈ షాహీ పిస్తా కొబ్బరి లడ్డూల తయారీ కోసం మీరు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి, అందులో తురిమిన కొబ్బరిని వేసి సన్నని మంటపై దొరగా వేయించాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్-2: ఇప్పుడు మిక్సీ జార్‌లో జీడిపప్పు, బాదం, పిస్తా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్లీ కడాయిలో వేయించి పెట్టుకున్న కొబ్బరిని వేయాలి. అందులో గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో అర కప్పు కండెన్స్‌డ్ మిల్క్ ,చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
స్టెప్-3: ఆ మిశ్రమం పూర్తిగా సన్నని మంటపై ఆపకుండా కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడి కడాయి అంచులను వదులుతూ ముద్దలా దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత చేతులకు కొంచెం నెయ్యి రుద్దుకొని, కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ గుండ్రని లడ్డూలుగా చుట్టుకోవాలి.
ఇదే విధంగా మొత్తం మిశ్రమంతో లడ్డూలు తయారు చేసి. చివరికి వాడిని కొబ్బరి పొడిలో దొర్లించి, పైన తరిగిన పిస్తా పలుకుల వేస్తే సరిపోతుంది. వీటిని కాసేపు సెట్ అవ్వనిస్తే ఎంతో రుచికరమైన షాహీ పిస్తా కొబ్బరి లడ్డూలు సిద్ధమైనట్లే! ఇంట్లో శుభకార్యం ఉన్నా, ప్రత్యేక పంక్షన్‌లు ఉన్నా ఇవి ఎంతో స్పెషల్‌గా ఉంటాయి.
కొబ్బరి లడ్డూ ప్రయోజనాలు
తక్షణ శక్తి: కొబ్బరిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్, కండెన్స్‌డ్ మిల్క్ శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు అలసటను తగ్గించి చురుకుగా ఉంచుతాయి
ఎముకల బలం: అలాగే ఈ అడ్డూలో ఉపయోగించిన పిస్తా, బాదం, పాల ఉత్పత్తులలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి.
రోగనిరోధక శక్తి: డ్రై ఫ్రూట్స్‌లోని జింక్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, కొబ్బరిలోని లారిక్ యాసిడ్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
