AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వామ్మో.. ఏమిటీ విచిత్రం..! ఒక్కసారిగా ఒడ్డుకు ఎగిరిపడిన వేలాది చేపలు !

సముద్రంలో నుంచి ఒక్కసారిగా వేలాది చేపలు నీటిపైకి ఎగిరిపడ్డాయి. ఈ అరుదైన ఘటన స్పెయిన్‌లోని మలాగా సమీపంలోని కోస్టా డెల్ సోల్ తీరంలో చోటుచేసుకుంది. వెండి రంగులో చిన్నగా ఉన్న ఈ చేపలను లాచాస్ జాతికి చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ అసాధారణ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Watch: వామ్మో.. ఏమిటీ విచిత్రం..! ఒక్కసారిగా ఒడ్డుకు ఎగిరిపడిన వేలాది చేపలు !
Spain Fish Video
Korivi Jayakumar
| Edited By: |

Updated on: Nov 17, 2026 | 3:45 PM

Share

సముద్రంలో నుంచి ఒక్కసారిగా వేలాది చేపలు నీటిపైకి ఎగిరిపడితే ఎలా ఉంటుంది? వినడానికే అవాక్కయ్యేలా ఉన్న ఈ ఘటనను.. బీచ్ ఒడ్డున ఉన్నవారి కళ్ల ముందే జరుగుతూ ఉంటే ఆశ్చర్యపోకుండా ఉంటారా? ఇలాంటి అరుదైన సంఘటనే స్పెయిన్‌లోని మలాగా సమీపంలోని కోస్టా డెల్ సోల్ తీరంలో చోటుచేసుకుంది. సముద్రం లోపలి నుంచి వెండి రంగులో చిన్న చిన్న మెరిసే చేపలు గుంపులుగా నీటి నుంచి బయటకు దూకుతూ ఒడ్డుకు చేరాయి. ఒడ్డుపైకి వచ్చిన తర్వాత కొన్ని చేపలు ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా కొట్టుమిట్టాడాయి. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించగా.. ప్రస్తుతం సదరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అసలు కారణం ఇదే..

సాధారణంగా పెద్ద చేపలు లేదా ఇతర సముద్ర జీవుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చిన్న చేపలు గుంపులుగా వేగంగా కదులుతుంటాయి. ఈ క్రమంలోనే ఏదో తమను తరుముతుండటంతో ఈ చేపలు ఒక్కసారిగా నీటి నుంచి బయటకు దూకి ఉంటాయని స్థానిక మత్స్యకారులు భావిస్తున్నారు. ఈ చిన్న చేపలు లాచాస్ జాతికి చెందినవిగా మలాగా మత్స్యకారుల సంఘం ప్రతినిధి మారి కార్మెన్ నవాస్ తెలిపారు. ఈ చేపల గుంపును వేటాడేంది ట్యూనా చేప అని కొందరు.. షార్క్‌ల గుంపు అయి ఉండొచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

చేపలకు మరో ముప్పుగా మారిన సీగల్స్..

ఇక ఒడ్డుపైకి ఎగిరిపడిన చేపలకు ఆకాశంలో తిరుగుతున్న డజన్ల కొద్దీ సీగల్స్ (సముద్రపు పక్షులు) నుంచి మరో ముప్పు ఎదురైనట్టు తెలుస్తోంది. ఒడ్డుపై పడి ఉన్న చేపలను సీగల్స్ ఒక్కసారిగా కిందకు వాలుతూ తమ ముక్కులతో పట్టుకెళుతున్నాయి. ఈ ఆసక్తికర ఘటనను చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి చిన్నారులు, స్థానికులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. అలానే ఈ అసాధారణ దృశ్యాన్ని కొందరు బైబిల్‌లోని నూతన నిబంధనలో ప్రస్తావించిన అద్భుత ఘటనతో పోలుస్తున్నారు. మరోవైపు అసలు ఈ వీడియోలు నిజమైనవేనా? లేక ఏఐ సాయంతో సృష్టించినవా? అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

స్పెయిన్ తీరంలో వింత ఘటన వీడియో..

Follow Us
ఏందయ్యా ఇది ??? సముద్రం నుంచి ఒడ్డుకు వేలాది చేపలు.. వీడియో వైరల్
ఏందయ్యా ఇది ??? సముద్రం నుంచి ఒడ్డుకు వేలాది చేపలు.. వీడియో వైరల్
తక్షణ శక్తితో పాటు ఎముకలకు బాలన్ని ఇచ్చే లడ్డూ..రోజూ ఒక్కటి తింటే
తక్షణ శక్తితో పాటు ఎముకలకు బాలన్ని ఇచ్చే లడ్డూ..రోజూ ఒక్కటి తింటే
3 సార్లు చెత్త పెళ్లిళ్లు చేసుకున్నా.. 44 ఏళ్ల వయసులో ఒంటరిగా..
3 సార్లు చెత్త పెళ్లిళ్లు చేసుకున్నా.. 44 ఏళ్ల వయసులో ఒంటరిగా..
పెట్రోల్, డీజిల్‌పై కొత్త ట్యాక్సులు.. కేంద్రం బిగ్ అప్డేట్..
పెట్రోల్, డీజిల్‌పై కొత్త ట్యాక్సులు.. కేంద్రం బిగ్ అప్డేట్..
ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై.. ఇకపై కొత్త అవతారంలో తల..
ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై.. ఇకపై కొత్త అవతారంలో తల..
మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా.. మీ మనసు చెప్పే రహస్యం..
మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా.. మీ మనసు చెప్పే రహస్యం..
ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి.. ప్రతీ రోజూ బోలెడెంత డబ్బులు
ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి.. ప్రతీ రోజూ బోలెడెంత డబ్బులు
డ్యూటీలో ఉన్నట్టు రికార్డులు.. కట్‌చేస్తే ఫామ్‌హౌస్‌లో జల్సాలు..
డ్యూటీలో ఉన్నట్టు రికార్డులు.. కట్‌చేస్తే ఫామ్‌హౌస్‌లో జల్సాలు..
తెలంగాణపై అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. వర్షాలే వర్షాలు
తెలంగాణపై అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. వర్షాలే వర్షాలు
అప్పుడు లావుగా ఉన్నా అన్నారు.. ఇప్పుడు చిక్కిపోయా అంటున్నారు
అప్పుడు లావుగా ఉన్నా అన్నారు.. ఇప్పుడు చిక్కిపోయా అంటున్నారు