AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.7 టికెట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరాలైంది.. కూలీ భార్యను వరించిన అదృష్టం!

జీవితంలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. సాధారణంగా ఎన్నో కష్టాలతో పూట గడిపే పేదల జీవితాలు ఒక్క క్షణంలో మారిపోతుంటాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఒక ఘటనే ఇందుకు నిదర్శనం. కేవలం ఏడు రూపాయలు ఖర్చు చేసి లాటరీ టికెట్ కొన్న ఒక నిరుపేద కూలీ భార్య ఒక్క రాత్రిలోనే కోటీశ్వరురాలైంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో, స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

రూ.7 టికెట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరాలైంది.. కూలీ భార్యను వరించిన అదృష్టం!
Punjab Lottery Winner
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2026 | 7:13 AM

Share

జీవితంలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. సాధారణంగా ఎన్నో కష్టాలతో పూట గడిపే పేదల జీవితాలు ఒక్క క్షణంలో మారిపోతుంటాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఒక ఘటనే ఇందుకు నిదర్శనం. కేవలం ఏడు రూపాయలు ఖర్చు చేసి లాటరీ టికెట్ కొన్న ఒక నిరుపేద కూలీ భార్య ఒక్క రాత్రిలోనే కోటీశ్వరురాలైంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో, స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

పంజాబ్ రాష్ట్రంలో ఒక పేద కూలీ కుటుంబం రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. పంజాబ్ లోని ఫరీద్‌కోట్ జిల్లా పరిధిలోని కోట్‌కపురా ప్రాంతానికి చెందిన బిమలాదేవి అనే మహిళ ఇంట్లో దినసరి కూలీగా పనిచేసే భర్తతో కలిసి జీవనం సాగిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ఒకరోజు సాయంత్రం సమయంలో బిమలా దేవి కొన్ని పనులు నిమిత్తం రైల్వే రోడ్డు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆమెకు అనుకోకుండా లాటరీ టికెట్లు అమ్ముతున్న ఒక చిన్న స్టాల్ కనిపించింది.

అనుకోకుండా కలిగిన చిన్న కోరికతో ఆమె కేవలం రూ. 7లు వెచ్చించి సిక్కిం స్టేట్ లాటరీకి సంబంధించిన ఒక టికెట్‌ను కొనుగోలు చేశారు. దానిని పెద్దగా పట్టించుకోకుండా ఇంటికి వచ్చేసారు. అయితే, మరుసటి రోజు సాయంత్రం లాటరీ ఫలితాలు వెలువడినప్పుడు ఆమె కొన్న టికెట్‌ నంబర్‌కు ఏకంగా 1 కోటి రూపాయల బంపర్ ప్రైజ్ తగిలినట్లు తేలింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ కుటుంబం ఆశ్చర్యంతో పాటు పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది.

లాటరీ నిర్వాహకులు, స్థానిక దుకాణదారుడు నరేష్ మోంగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు స్వయంగా తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు దుకాణం వద్దకు చేరుకుని ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ, ఆనందంతో భాంగ్రా నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. దుకాణదారుడు మాట్లాడుతూ, తన జీవితంలో, తన షాప్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో బహుమతి రావడం ఇదే మొదటిసారని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ భారీ విజయంపై బిమలా దేవి మాట్లాడుతూ, వచ్చిన ఈ కోటి రూపాయలతో తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తీరిపోతాయని చెప్పారు. ఈ డబ్బును తెలివిగా ఉపయోగించి తమ పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేస్తామని, అలాగే ఏదైనా చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించి కుటుంబాన్ని స్థిరపరుస్తామని ఆమె తెలిపారు. పేదరికంలో మగ్గుతున్న ఒక కుటుంబానికి అదృష్టం ఇలా అందిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కేవలం 7 రూపాయల టికెట్.. కూలీ భార్యను కోటీశ్వరాలిని చేసిన అదృష్టం!
కేవలం 7 రూపాయల టికెట్.. కూలీ భార్యను కోటీశ్వరాలిని చేసిన అదృష్టం!
కోజాగిరి పౌర్ణమి.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు ఇలా పూజించండి
కోజాగిరి పౌర్ణమి.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు ఇలా పూజించండి
పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. విచిత్ర వీడియో వైరల్‌
పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. విచిత్ర వీడియో వైరల్‌
ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు తులం ఎంతంటే?
ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు తులం ఎంతంటే?
ఏపీలో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్.. ఇక భారీ వర్షాలే..
ఏపీలో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్.. ఇక భారీ వర్షాలే..
రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా ఊరట.. మీ రాశికి ఎలా ఉందంటే..?
రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా ఊరట.. మీ రాశికి ఎలా ఉందంటే..?
బంగారం ధరలు రూ.5 వేలు డౌన్.. కొనేవారికి ఇదే సమయం
బంగారం ధరలు రూ.5 వేలు డౌన్.. కొనేవారికి ఇదే సమయం
మూడ్రోజులు కరెంటు బంద్.. ప్రజలకు బ్రిటన్ ప్రభుత్వం కీలక సూచనలు
మూడ్రోజులు కరెంటు బంద్.. ప్రజలకు బ్రిటన్ ప్రభుత్వం కీలక సూచనలు
ఫ్రెంచ్ ఓపెన్ 2026: ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు..
ఫ్రెంచ్ ఓపెన్ 2026: ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు..
మారిన ఎస్బీఐ ఏటీఎం విత్ డ్రా రూల్స్.. ఈ లిమిట్ దాటితే కష్టమే..
మారిన ఎస్బీఐ ఏటీఎం విత్ డ్రా రూల్స్.. ఈ లిమిట్ దాటితే కష్టమే..