AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవి ప్రతాపానికి యూర‌ప్‌ విలవిల.. 50,000 మంది బలి..

వేసవి ప్రతాపానికి యూర‌ప్‌ విలవిల.. 50,000 మంది బలి..

Phani CH
|

Updated on: Oct 24, 2026 | 7:08 PM

Share

యూరప్‌లో ఈ ఏడాది వేసవిలో నమోదైన తీవ్ర ఉష్ణోగ్రతలు భారీ ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని రెండు అధ్యయనాలు వెల్లడించినట్లు కథనం పేర్కొంది. దాదాపు 50 వేల మరణాలు, 19 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనాలు వెలువడ్డాయి. శిలాజ ఇంధనాల వినియోగంతో పెరిగిన ఉష్ణోగ్రతలు మరణాల సంఖ్యను పెంచాయని పరిశోధకులు తెలిపారు. ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌ ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర వేడి ప్రభావం చూపినట్లు విశ్లేషణలు సూచించాయి.

ప్రపంచవ్యాప్తంగా చుట్టుముడుతున్న వాతావరణ మార్పుల ధాటికి యూరప్‌ ఖండం విలవిల్లాడుతోంది. ఈ ఏడాది వేసవిలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల తీవ్రతకు ఏకంగా 50,000 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 19 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.1.79 లక్షల కోట్లు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని రెండు వేర్వేరు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రాణ, ఆస్తి నష్టాల పరంగా యూరప్‌ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన వేసవిగా నిలిచింది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తల నేతృత్వంలో యూకే, స్విట్జర్లాండ్, నార్వే మరియు యూరోపియన్ యూనియన్‌లోని 30 దేశాలకు చెందిన 854 నగరాల్లో పరిశోధన నిర్వహించారు. రికార్డు స్థాయిలో సంభవించిన 50,000 మరణాల్లో మూడింట రెండొంతుల మంది.. మానవ తప్పిదాల వల్ల, శిలాజ ఇంధనాల వాడకం వల్ల పెరిగిన ఉష్ణోగ్రతల మూలంగానే చనిపోయారని నివేదిక స్పష్టం చేసింది. గతంలో 2022లో 29,000 మంది, 2003లో 28,000 మంది మరణించగా, ఈసారి ఆ సంఖ్యను దాటిపోవడం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. మరొకవైపు ‘బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్స్’ చేసిన విశ్లేషణ ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో యూరప్ సమాఖ్య జీడీపీలో 0.17 శాతం నష్టం వాటిల్లింది. ఇది గత దశాబ్దపు సగటు నష్టం కంటే రెండున్నర రెట్లు ఎక్కువ. తీవ్ర వేడి కారణంగా ఫ్రాన్స్ జీడీపీ 0.2 శాతం, జర్మనీ 0.1 శాతం, స్పెయిన్ 0.05 శాతం మేర తగ్గుదల నమోదు చేశాయి. ఈ ఏడాది మే నెలలోనే ప్రారంభమైన వడగాల్పులు సెప్టెంబర్ వరకు కొనసాగాయి. పశ్చిమ యూరప్‌లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుంచి కొన్ని రోజులైతే ఏకంగా 12 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల కార్చిచ్చులు చెలరేగడం, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం, ఆసుపత్రులపై ఒత్తిడి పెరగడం, రవాణా వ్యవస్థలు స్తంభించడం, కూలింగ్ సిస్టమ్స్ విఫలమవడం వంటి తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు నేరుగా కాకుండా, గుండె, శ్వాసకోశ వంటి ముందస్తు ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేయడం వల్ల మరణాల అసలు సంఖ్యను గుర్తించడం కష్టమవుతుందని, కాబట్టి వాస్తవ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్క కరిచిన ఆవు మృతి.. పాలు తాగిన 450 మందికి టీకాలు.. పాలతో రేబిస్‌ సోకుతుందా?

వ్యర్థం కాదు.. సంపద GWMC వినూత్న ప్రయోగం!

అయ్యో.. భర్త హగ్‌ చేసుకోగానే కుప్పకూలిన మహిళ

కేదార్‌నాథ్‌లో మంచు వర్షం.. సెల్ఫీలతో యాత్రికుల సందడి

ఎస్‌బీఐ కస్టమర్ల డేటా లీక్ ! పాస్‌వర్డ్స్ మార్చుకోవాలని నిపుణుల సూచన

Follow Us