AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్క కరిచిన ఆవు మృతి.. పాలు తాగిన 450 మందికి టీకాలు.. పాలతో రేబిస్‌ సోకుతుందా?

కుక్క కరిచిన ఆవు మృతి.. పాలు తాగిన 450 మందికి టీకాలు.. పాలతో రేబిస్‌ సోకుతుందా?

Phani CH
|

Updated on: Oct 24, 2026 | 7:07 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో వీధి కుక్క కరిచిన ఆవు మృతి చెందడంతో, ఆ ఆవు పాలను వినియోగించిన రెండు గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముందుజాగ్రత్తగా సుమారు 450 మంది రేబిస్‌ టీకాలు వేయించుకున్నట్లు సమాచారం. అయితే పాలు తాగడం ద్వారా రేబిస్‌ వ్యాపిస్తుందని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అనుమానిత జంతువుల పాలను వినియోగించకుండా, కాటు లేదా లాలాజల సంబంధిత ప్రమాదాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వీధి కుక్క కరవడంతో అనారోగ్యానికి గురైన ఒక ఆవు ఇటీవల మృతి చెందింది. అయితే ఆ ఆవు ఇచ్చిన పాలను స్థానికులు ప్రసాదం తయారీకి, ఇతర గృహ అవసరాలకు ఉపయోగించారు. దీంతో ఆ పాలను వినియోగించిన రెండు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ముందుజాగ్రత్త చర్యగా సుమారు 450 మంది స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో రేబిస్ టీకాలు వేయించుకున్నారు. ఈ ఘటనతో “రేబిస్ సోకిన జంతువుల పాలు తాగితే మనుషులకు ఆ వ్యాధి వస్తుందా?” అనే సందేహం అందరిలోనూ మొదలైంది. సాధారణంగా రేబిస్ అనేది ఒక ప్రాణాంతక వైరల్ వ్యాధి. రేబిస్ బారిన పడిన జంతువులు కరిచినా లేదా వాటి లాలాజలం మనుషుల గాయాలకు, కళ్లు, నోరు వంటి శ్లేష్మ పొరలకు తగిలినా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అయితే, పాలు లేదా పాల ఉత్పత్తుల ద్వారా రేబిస్ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అని ‘జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం’ స్పష్టం చేసింది. ఇప్పటివరకు నిర్వహించిన పరిశోధనల్లో పాల ద్వారా ఈ వ్యాధి సోకినట్లు దాఖలాలు లేవని, కాబట్టి ఆ పాలు తాగినంత మాత్రాన టీకాలు తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, రేబిస్ ఉన్నట్లు అనుమానం ఉన్న జంతువుల పాలను వాడకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ జంతువు కరిచినా లేదా దాని లాలాజలం గాయాలపై పడినా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వ్యర్థం కాదు.. సంపద GWMC వినూత్న ప్రయోగం!

అయ్యో.. భర్త హగ్‌ చేసుకోగానే కుప్పకూలిన మహిళ

కేదార్‌నాథ్‌లో మంచు వర్షం.. సెల్ఫీలతో యాత్రికుల సందడి

ఎస్‌బీఐ కస్టమర్ల డేటా లీక్ ! పాస్‌వర్డ్స్ మార్చుకోవాలని నిపుణుల సూచన

2027 ప్రపంచకప్‌.. కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై బీసీసీఐ చీఫ్ క్లారిటీ

Follow Us