Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మూవీ ట్రైలర్ రిలీజ్
వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ అధికారిక ట్రైలర్ విడుదలైంది. వింటేజ్ వెంకీ కామెడీ, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు క్యారెక్టర్ టీజర్లతో ఆసక్తి పెంచిన చిత్రబృందం, తాజా ట్రైలర్‌తో కథపై మరిన్ని అంచనాలు పెంచింది. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమాతో ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్ తర్వాత విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి మోస్ట్ అవేటెడ్ అప్‌డేట్ వచ్చింది. అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన యూనిట్, వెంకీ-త్రివిక్రమ్ కాంబో మీద ఉన్న అంచనాలను అందుకుందా..? ఈ స్టోరీలో చూద్దాం. ఇప్పటి వరకు ఆదర్శ కుటుంబం వరల్డ్ నుంచి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్స్ మాత్రమే రివీల్ అయ్యాయి. సినిమా లుక్ ఎలా ఉండబోతుంది, వెంకీ క్యారెక్టర్‌ను ఎంత సరదాగా డిజైన్ చేశారు లాంటి హింట్స్ ఇచ్చింది యూనిట్. ఇప్పుడు ఈ సినిమా నుంచి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్, అసలు కథ ఎలా ఉండబోతుందో ఈ ఒక్క ట్రైలర్‌తో ఆడియన్స్‌కు పరిచయం చేశారు మేకర్స్. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే కామెడీ ఫ్యామిలీ డ్రామాకు ఊహించని థ్రిల్లర్ ఎలిమెంట్‌ను కూడా యాడ్ చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ ఆరంభంలో వింటేజ్ వెంకీ మార్క్ కామెడీ, త్రివిక్రమ్ ప్రాసలతో నవ్వించి, చివర్లో సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ షాట్స్‌తో ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. కామెడీతో పాటు ఎమోషన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌కు ఈక్వల్ ఎలివేషన్ ఇస్తూ సినిమా మీద బజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లారు. ట్రైలర్‌లో వెంకటేష్ చెప్పిన డైలాగ్స్, ఫ్యామిలీ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో ఈ క్రేజీ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగితే రూ.2 లక్షలు ఎలా పొందాలి?
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్.. మైసూర్ దసరా జంబూ సవారీ వెనుక అసలు రహస్యం ఇదే
రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!
రుద్రాక్షలో ప్రభాస్ ఫొటో.. కుప్పంలో అభిమాని కళా నైపుణ్యం
తక్కువ ఛార్జీకే రాపిడో బైక్ ఎక్కాడని...ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్

