AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థుల భద్రత కోసం వినూత్న ప్రయోగం.. యూనివర్సిటీ హాస్టళ్లలో యాంటీ-సూసైడ్ ఫ్యాన్స్!

దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గుజరాత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ హాస్టల్ గదులలో యాంటీ-సూసైడ్ ఫ్యాన్స్ ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నిర్ణయాన్ని కొందరు అభినందిస్తుంటే, మరికొందరు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి మానసిక కౌన్సిలింగ్ కూడా ఎంతో ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థుల భద్రత కోసం వినూత్న ప్రయోగం.. యూనివర్సిటీ హాస్టళ్లలో యాంటీ-సూసైడ్ ఫ్యాన్స్!
Anti Suicide Fans
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2026 | 11:27 AM

Share

ప్రస్తుత కాలంలో ఇంజనీరింగ్, మెడికల్‌, ఇతర ప్రతిష్టాత్మక కాలేజీలలో చదువుతున్న విద్యార్థులు విద్యాపరమైన, వ్యక్తిగత ఒత్తిళ్ల కారణంగా తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్యల వంటి దుర్మార్గపు నిర్ణయాలు తీసుకుంటున్న సంఘటనలు తరచూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలను రక్షించేందుకు విద్యాసంస్థలు వినూత్న భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని ఒక ప్రముఖ యూనివర్సిటీ హాస్టల్ గదులలో ఏర్పాటు చేసిన యాంటీ-సూసైడ్ ఫ్యాన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

గుజరాత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ హాస్టల్ గదులలో విద్యార్థుల భద్రత కోసం సీలింగ్ ఫ్యాన్‌లలో ప్రత్యేక మార్పులు చేశారు. సాధారణంగా ఫ్యాన్‌లకు అమర్చే ఉరివేసుకునే ప్రమాదాలను నివారించేందుకు వీటిని యాంటీ-సూసైడ్ ఫ్యాన్స్ గా తీర్చిదిద్దారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, వ్యక్తి ఒకరు ఆ ఫ్యాన్‌ను క్రిందికి లాగగానే అది సులభంగా ఊడి రావడం కనిపిస్తుంది. ఈ ఫ్యాన్ ప్రత్యేకత ఏమిటంటే, దీనికి సుమారు 10 కిలోల కంటే ఎక్కువ బరువు తగిలితే, ఆటోమేటిక్‌గా స్ప్రింగ్ సిస్టమ్ ద్వారా ఫ్యాన్ కిందకు వచ్చేస్తుంది. దీనివల్ల ఇటువంటి దురదృష్టకర సంఘటనలను కొంతవరకు అడ్డుకోవచ్చని యాజమాన్యం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయిన తర్వాత నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. విద్యార్థుల ప్రాణాలను రక్షించేందుకు యూనివర్సిటీ తీసుకున్న ఈ ముందస్తు చర్యను కొందరు నెటిజన్లు ఎంతగానో అభినందిస్తున్నారు. దేశంలోని ప్రతి కాలేజీ హాస్టల్‌లోనూ ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

అయితే, మరికొందరు మాత్రం కేవలం ఫ్యాన్‌లు మార్చడం ద్వారానే ఆత్మహత్యలను పూర్తిగా ఆపలేమని, మూల కారణాలను గుర్తించాలని సూచిస్తున్నారు. విద్యార్థులపై ఉండే విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించాలని, వారికి సరైన మానసిక కౌన్సిలింగ్ అందించాలని, విద్యార్థులు తమ సమస్యలను ఓపెన్‌ గా చెప్పుకుని మాట్లాడేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. భద్రతా చర్యలతో పాటు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అత్యంత కీలకమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us