AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమాను బ్యాన్ చేయండి.. వివాదం రేపిన టీజర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డాక్టర్లు

కొన్ని సినిమాలు ఊహించని వివాదాల్లో చిక్కుకుంటాయి. విడుదలకు ముందే కొన్ని సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటుంటాయి. తాజాగా ఓ సినిమా ఇప్పుడు ఊహించని వివాదం రేపింది. ఈ సినిమాను డిమాండ్ చేయాలని ఏకంగా డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకూ ఆ సినిమా ఏది.? ఆ వివాదం ఏంటి.?

ఆ సినిమాను బ్యాన్ చేయండి.. వివాదం రేపిన టీజర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డాక్టర్లు
Movie
Rajeev Rayala
|

Updated on: Oct 25, 2026 | 11:31 AM

Share

సన్ని డియోల్ పుట్టినరోజు అక్టోబర్ 19 సందర్భంగా విడుదలైన ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ సినిమా టీజర్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఎమ్. పద్మకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ, థియేటర్లలోకి రాకముందే ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఆరోగ్య రంగాన్ని, వైద్య వృత్తిని నెగెటివ్ గా చూపించారంటూ వైద్య లోకం ఈ చిత్రంపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ‘సూర్య’ టీజర్‌లో సన్నీ డియోల్ ఒక వ్యక్తిగత విషాదం తర్వాత, వైద్య వ్యవస్థలోని లోపాలు అలాగే అవినీతిని ప్రశ్నించే శక్తివంతమైన పాత్రలో కనిపించారు. టీజర్‌లో ఉండే కొన్ని సంచలన డైలాగులు వైద్య వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. “డాక్టర్లు రాసేది ప్రిస్క్రిప్షన్ కాదు… కమీషన్లు!” వైద్యులను దేవుడిలా భావించే సమాజంలో, కొందరు రోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజుతున్నారనే కోణంలో టీజర్ సన్నివేశాలు సాగాయి. ఈ టీజర్‌పై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సమాజంలో ఒకరిద్దరు చేసే తప్పులను ఎత్తిచూపుతూ, మొత్తం వైద్య వృత్తికే అవినీతి రంగు పులమడం సరికాదని వైద్యులు వాపోతున్నారు. ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు అలాగే ఇతర సిబ్బందిపై జరిగే భౌతిక దాడులను సినిమాలో ‘హీరోయిజం’గా చూపించడం వల్ల, నిజ జీవితంలోనూ వైద్యులపై దాడులు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ వివాదంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల సంఘం అత్యవసరంగా స్పందించాయి. ఐఎంఏ ప్రతినిధులు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అత్యవసర లేఖ రాశారు. “వైద్య రంగంలో అవినీతిని ప్రశ్నించడాన్ని మేము తప్పుపట్టడం లేదు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ, సినిమాల్లో వైద్యులపై హింసను నార్మలైజ్ చేయడం వల్ల రోగికి, డాక్టర్‌కు మధ్య ఉండే నమ్మకం దెబ్బతింటుంది” అని లేఖలో పేర్కొన్నారు.

వివాదాస్పద ప్రోమోలను తక్షణమే సమీక్షించాలని, చిత్ర యూనిట్ తగిన మార్పులు చేయకపోతే సినిమా విడుదలపై నిషేధం విధించాలని IMA స్పష్టం చేసింది. వివాదంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ స్పందిస్తూ ‘సూర్య’ చిత్రం ఇంకా సెన్సార్ సర్టిఫికేషన్ కోసం తమ వద్దకు రాలేదని స్పష్టం చేసింది. డాక్టర్ల నుంచి వస్తున్న తీవ్ర నిరసనల నేపథ్యంలో ‘సూర్య’ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో, టీజర్‌లోని వివాదాస్పద వ్యాఖ్యలపై ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us