Purnima 2026: పౌర్ణమి నుంచి వీరికి దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Purnima 2026 Astrology: శరద్ పూర్ణిమ వేళ గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుందా? ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయా? జ్యోతిష్య అంచనాల ప్రకారం మూడు రాశుల వారికి ఈ పౌర్ణమి ఎలాంటి శుభ ఫలితాలను అందించనుందో తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమిని శరద్ పూర్ణిమగా జరుపుకుంటారు. 2026లో శరద్ పూర్ణిమ అక్టోబర్ 26, సోమవారం వచ్చింది. ఈ సందర్భంగా తులా రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఉండటం వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య గణనలు సూచిస్తున్నాయి. శరద్ పూర్ణిమ సందర్భంగా ఏర్పడే గ్రహస్థితులు కర్కాటక, కన్యా, మకర రాశుల వారికి అనుకూల ఫలితాలను సూచిస్తున్నాయి. ఆ రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసివచ్చే సూచనలు ఉన్నాయట.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శరద్ పూర్ణిమ సమయం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత పెరగడంతో పాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. తమ కష్టానికి తగిన ప్రతిఫలం పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనితీరుతో గుర్తింపు పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించే వారికి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారికి కొంత ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. అయితే ఆదాయం పెరిగినప్పుడు అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ పౌర్ణమి సమయంలో జీవితంలోని కొన్ని రంగాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్‌లో ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో అనుకూలత కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం ద్వారా ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం, ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి శరద్ పూర్ణిమ సమయం ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. అదృష్టం అనుకూలించడంతో చాలాకాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదులుతాయి. ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లో సానుకూల పరిణామాలు నెలకొంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి శుభవార్త అందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరిగి బంధాలు బలపడుతాయి. వ్యక్తిగత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
శరద్ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సంపద, సౌభాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. చంద్రుని వెన్నెలకు ఈ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ప్రాంతీయ సంప్రదాయాలను అనుసరించి పూజలు, ఉపవాసాలు నిర్వహిస్తారు.
గమనిక: ఈ కథనం జ్యోతిష్య విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా రూపొందించబడింది. గ్రహస్థితుల వల్ల ఆర్థిక లాభాలు లేదా ఉద్యోగ విజయాలు తప్పనిసరిగా కలుగుతాయని శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు.




