AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Shroff: ఒక్క వాటర్ బాటిల్ ధర రూ.600.. రోజుకు మంచి నీటి కోసమే రూ.3,600 ఖర్చు చేస్తున్నాడా..

టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు . నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయుధాల సరఫరా వ్యవస్థపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనే ముగ్గురు షూటర్లను కోటాలో పట్టుకున్నారు పోలీసులు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ లింకులపై విచారణ జరుపుతున్నారు.

Tiger Shroff: ఒక్క వాటర్ బాటిల్ ధర రూ.600.. రోజుకు మంచి నీటి కోసమే రూ.3,600 ఖర్చు చేస్తున్నాడా..
Tiger Shroff
Rajeev Rayala
|

Updated on: Oct 25, 2026 | 10:09 AM

Share

సినీ తారల ఫిట్‌నెస్‌, డైట్‌, లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు ఉపయోగించే వస్తువుల ధరలు బయటకు వస్తే అభిమానులు ఆశ్చర్యపోతుంటారు. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన ఓ వాటర్ బాటిల్ నెట్టింట చర్చకు దారితీసింది. ఆయన ఉపయోగించినట్లు ప్రచారం జరుగుతున్న నీటి బాటిల్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.! టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన ఓ వీడియోలో కనిపించిన వాటర్ బాటిల్‌పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ బాటిల్ ప్రముఖ ఇటాలియన్ బ్రాండ్ శాన్ పెల్లెగ్రినో (S.Pellegrino)కు చెందిన స్పార్క్లింగ్ మినరల్ వాటర్‌గా ప్రచారం జరుగుతోంది. 750 మిల్లీలీటర్ల బాటిల్ ధర సుమారు రూ.600 ఉంటుందని కొన్ని నివేదికల్లో పేర్కొంటున్నారు.

సాధారణంగా అందరూ తాగే నీటితో పోలిస్తే ఈ తరహా ప్రీమియం వాటర్ ధర ఎక్కువగా ఉంటుంది. టైగర్ ష్రాఫ్ రోజుకు ఆరు లీటర్ల నీరు తాగుతాడని అనుకుంటే, లీటరు నీటికి రూ.600 చొప్పున లెక్కిస్తే రోజువారీ ఖర్చు రూ.3,600 అవుతుంది. అదే లెక్కన నెలకు రూ.1.08 లక్షలు, ఏడాదికి దాదాపు రూ.13.14 లక్షలు ఖర్చవుతాయి. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే. క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా తన ఫిట్‌నెస్‌, ఆహారపు అలవాట్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాడనే విషయం తెలిసిందే. గతంలో కోహ్లీ ఫ్రెంచ్ బ్రాండ్ ఎవియన్ (Evian) మినరల్ వాటర్‌ను ఉపయోగిస్తాడని పలు మీడియా కథనాలు వెల్లడించాయి.

2020లో జీక్యూ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం, అప్పట్లో లీటరు ఎవియన్ వాటర్ ధర సుమారు రూ.600గా పేర్కొన్నారు. మరోవైపు, కోహ్లీ బ్లాక్ ఆల్కలైన్ వాటర్ తాగుతాడని, దాని ధర లీటరుకు వేల రూపాయల వరకు ఉంటుందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ధరలన్నీ ఒకే ఉత్పత్తికి సంబంధించినవి కావు. బాలీవుడ్ సెలబ్రిటీల ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్‌ రొటీన్‌పై అభిమానులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు. ఖరీదైన మినరల్ వాటర్‌, ఆల్కలైన్ వాటర్‌ వంటి ఉత్పత్తులు కూడా అప్పుడప్పుడు సెలబ్రిటీల పేర్లతో వార్తల్లో నిలుస్తుంటాయి. ఇదిలా ఉంటే టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు . నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయుధాల సరఫరా వ్యవస్థపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనే ముగ్గురు షూటర్లను కోటాలో పట్టుకున్నారు పోలీసులు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ లింకులపై విచారణ జరుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us