AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో మహేష్ కూడా ఒకడు. వయసు పెరుగుతున్నా కొద్దీ అతను మరింత గ్లామరస్‌గా తయారవుతున్నాడు. ‘ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్’ అనిపించుకుంటున్నాడు.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2026 | 10:24 AM

Share

ఒకప్పుడు తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి యమున.అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఆమె ఆతర్వాత ఊహించని విధంగా గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో యమున  మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభ దశలో ఇతర నటీమణులకు తాను పోటీ కాదని, తన పాత్రలన్నీ ప్రత్యేకమైనవని అన్నారు. ఎందుకంటే తాను గ్లామర్ పాత్రలకు దూరంగా, విభిన్నమైన క్యారెక్టర్లు చేశానని, అందుకే ఎవరూ తనను పోటీగా భావించలేదని తెలిపారు. దర్శకుడు దాసరి నారాయణ రావుతో తనకున్న బలమైన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, “మామగారు” సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత దాసరి సినిమాల్లో తాను ఎక్కువగా నటించే అవకాశం లభించిందని చెప్పారు. అయితే, ఒకే రకమైన పాత్రలు తన వద్దకు వచ్చేవని, “నాగమ్మ” తర్వాత చాలా పాము సబ్జెక్ట్ సినిమాలు వచ్చాయని వివరించారు.

ఇది కూడా చదవండి :

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు

ఇటీవల మళ్లీ సినిమాలు చేస్తారని కొందరు ఆశించినప్పటికీ, తాను సీరియల్స్‌తో బిజీగా ఉండడం వల్ల అవకాశాలను అందుకోలేకపోయానని అన్నారు. సీరియల్స్‌లో నటించడం తనకు ఎంతో సౌకర్యంగా ఉందని, ఒకే చోట, కుటుంబ వాతావరణంలో పనిచేయడం ఇష్టమని ఆమె వివరించారు. పాత్రల విషయంలో తనకు ఎలాంటి పరిమితులు లేవని యమున అన్నారు. “అమ్మ” పాత్రలు, “అక్క” పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, 20 ఏళ్ల క్రితమే తాను ఒక సీరియల్‌లో బామ్మ పాత్ర చేశానని గుర్తుచేసుకున్నారు.

ఇది కూడా చదవండి :

Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్

చిరంజీవి వంటి అగ్ర హీరోలకు అమ్మగా నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, అయితే అది ఎంతవరకు సరిపోతుందో తెలియదని నవ్వుతూ అన్నారు. మహేష్ బాబు వంటి హీరోలకు అమ్మగా నటించాలని తనకు కోరిక ఉందని, చూసినప్పుడల్లా ఆ పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుండేదనిపిస్తుందని అన్నారు యమున. అలాగే చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర తారలతో నటించలేకపోవడం తనకెంతో బాధ కలిగించిందని యమున వ్యక్తం చేశారు. ఆ సమయంలో వారికి సినిమా అవకాశాలు వచ్చినా, డేట్స్ సరిపోకపోవడం, మేనేజర్ లేకపోవడం, బ్యాలెన్స్ చేయడం తెలియకపోవడం వంటి కారణాలతో తాను మూడు పెద్ద సినిమాలను కోల్పోయానని వివరించారు. అయితే, చిరంజీవితో “మంజునాథ” సినిమాలో “గంగ” పాత్రలో చిన్న బిట్ చేయడం ద్వారా తన కల పాక్షికంగా నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ హీరో కాకముందే చిరంజీవి గారి ఇంటిలో ఆయనతో దాదాపు అరగంట మాట్లాడిన జ్ఞాపకాలను పంచుకున్నారు. అప్పటి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఇప్పటి పవర్ స్టార్ వ్యక్తిత్వం మారలేదని, అదే గౌరవం, పవర్ ఇప్పటికీ కనిపిస్తున్నాయని  యమున చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

బాప్రే బాప్..! ఇదెక్కడి సిరీస్ రా మావ.. మెంటలెక్కిస్తుంది..!! ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us