AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు, పన్నీర్‌, పప్పులు.. గింజలు.. ఈ ఒక్కటి తీసుకుంటే.. ఇక వాటితో పనే ఉండదు!

పాలు, పన్నీర్‌, పప్పులు.. గింజలు.. ఈ ఒక్కటి తీసుకుంటే.. ఇక వాటితో పనే ఉండదు!

Phani CH
|

Updated on: Aug 25, 2026 | 11:11 PM

Share

శాకాహారులకు సోయా మంచి పూర్తి స్థాయి ప్లాంట్ ప్రొటీన్ వనరు. మీల్‌మేకర్, సోయా కీమా, టోఫు, సోయా పాలు వంటి రూపాల్లో తీసుకోవచ్చు. ఇందులో ప్రొటీన్‌తో పాటు అవసరమైన అమినో యాసిడ్లు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. సోయాలోని ఐసోఫ్లేవోన్స్ గుండె, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. అందుకే సమతుల ఆహారంలో సోయాను చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

మాంసాహారానికి దీటుగా శాకాహారులకు పూర్తి స్థాయి ప్రొటీన్‌ను అందించే అద్భుతమైన ఆహార పదార్థం సోయా. గుడ్డు, చికెన్, మటన్‌లతో సంబంధం లేకుండా కేవలం సోయా తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయి. సోయా మొక్కల వేర్లలో ఉండే రైజోబియం అనే మంచి బ్యాక్టీరియా గాలిలోని నైట్రోజన్‌ను గ్రహించి గింజల్లో ప్రొటీన్లు, అమినో యాసిడ్లు తయారవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే దీనిని సంపూర్ణ ప్లాంట్ ప్రొటీన్ ఫుడ్‌గా పిలుస్తారు. రోజూ ఒక కప్పు మీల్‌మేకర్ లేదా సోయా కీమా తీసుకుంటే 15 నుంచి 22 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. పాలు, పనీర్ పడనివాళ్లకు సోయా పాలు, టోఫు అద్భుతమైన ప్రత్యామ్నాయాలు. కాలం మారుతున్న కొద్దీ సోయాలోనూ అనేక రకాల కొత్త వెరైటీలు మార్కెట్లోకి వస్తున్నాయి. మీల్‌మేకర్‌తో పాటు సోయా వెడ్జెస్‌, పెరీ పెరీ మసాలా పట్టించిన క్రంచీ స్నాక్స్, సోయా పాప్స్, సోయా చాప్స్, నూడుల్స్, ర్యాప్స్, చిప్స్, టెంపె వంటి ఎన్నో వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి రుచిలోనే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. సోయా కేవలం ప్రొటీన్లను మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అమినో యాసిడ్లను అందిస్తుంది. ఇందులో ఉండే ఐసోఫ్లేవోన్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. తక్కువ గ్లైసమిక్‌ ఇండెక్స్‌, అధిక పీచుశాతం ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇక, సోయాలో ఇనుము, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్‌… కూడా లభిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ను బ్యాలెన్స్‌ చేసి, మెనోపాజ్ దశ సమస్యలను తగ్గించడంలో, ఎముకలను దృఢంగా మార్చడంలో సోయా ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి బోలెడన్ని పోషకాలున్న సోయాను మీ ఆహారంలో భాగం చేసుకోండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? పీఎన్‌జీ వైపు అడుగులు వేస్తున్న కేంద్రం!

Follow Us