13 రోజుల ముందే రామాయణ బుకింగ్స్..అదిరిన ప్లానింగ్స్

×

13 రోజుల ముందే రామాయణ బుకింగ్స్..అదిరిన ప్లానింగ్స్

తెలుగు రాష్ట్రాల్లో రామాయణ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ అనూహ్యంగా విడుదల తేదీకి 13 రోజుల ముందే ప్రారంభమయ్యాయి. దిల్ రాజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల హక్కులను పొందగా, బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ ద్వారా బుకింగ్స్ ఓపెన్ చేసి అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. సాధారణంగా పాన్ ఇండియా చిత్రాలకు ఇంత ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వడం అరుదు. ఈ కారణంతోనే రామాయణ సినిమా అప్పుడే ట్రెండింగ్‌లోకి వచ్చింది. సాధారణంగా పెద్ద పాన్ ఇండియా చిత్రాలు విడుదలయ్యేటప్పుడు టికెట్ ధరలు పెంచడం చూస్తుంటాం. అయితే, దిల్ రాజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ రామాయణ సినిమాకు ఎలాంటి ధరల పెంపు లేకుండా రెగ్యులర్ రేట్లకే టికెట్స్‌ను అందుబాటులో ఉంచారు. దీనివల్ల ప్రేక్షకులకు సగం భారం తగ్గుతుందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర ₹177 ఉండగా, నైజాంలో గరిష్టంగా ₹295కు టికెట్స్ లభిస్తున్నాయి. గతంలో చాలా పెద్ద సినిమాలకు ధరల పెంపు నష్టాన్నే కలిగించింది తప్ప లాభం తేలేదు. అందుకే మేకర్స్ ఈ స్మార్ట్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ ధరలు పెరిగి ఉంటే, ప్రేక్షకులపై ₹50 నుంచి ₹100 అదనపు భారం పడేది. ఈ నిర్ణయంతో రామాయణ సినిమాకు కుటుంబ ప్రేక్షకుల మద్దతు గట్టిగా దక్కడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 5న విడుదల కానుంది.

Samatha J