సాగునీటి ఇక్కట్లు.. రాత్రీ పగలూ రైతుల పడిగాపులు

×

సాగునీటి ఇక్కట్లు.. రాత్రీ పగలూ రైతుల పడిగాపులు

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సాగునీటి ఎద్దడి తీవ్ర స్థాయికి చేరింది. బెజ్జూరు పరిధిలోని బోల్ చెరువు కింద సాగులో ఉన్న పొలాలకు సరిపడా నీరు అందక రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు, తక్కువ వర్షపాతం కారణంగా చెరువుల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. తమ కళ్ళముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నీటి కొరత కారణంగా, తమ పంటను కాపాడుకునేందుకు రైతులు నిరంతరం చెరువు నీటి కోసం పోటీ పడుతున్నారు. ఎప్పుడు తమ వంతు వస్తుందోనని రేయింబవళ్లు తేడా లేకుండా తమ పొలాల వద్దే కాపలా కాస్తున్నారు. అదను దాటితే పంటను కాపాడుకోవడం అసాధ్యమని, దీనివల్ల భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ప్రత్యామ్నాయ మార్గాలలో సాగునీటిని అందించేందుకు ప్రయత్నించాలని రైతులు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

Samatha J