AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: స్పిరిట్ వివాదం మళ్లీ రాజుకుంది.. వంగా బ్రదర్స్‌కు దీపికా పరోక్ష కౌంటర్?

Deepika Padukone: స్పిరిట్ వివాదం మళ్లీ రాజుకుంది.. వంగా బ్రదర్స్‌కు దీపికా పరోక్ష కౌంటర్?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 24, 2026 | 7:54 PM

Share

‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడంపై మరోసారి వివాదం చెలరేగింది. నిర్మాత ప్రణయ్ వంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియా పోస్టును దీపిక లైక్ చేయడంతో చర్చ మరింత ముదిరింది. హీరోలు లాభాల్లో వాటాలు తీసుకుంటున్నా, మహిళ అడిగితే అభ్యంతరం ఎందుకంటూ ఆ పోస్టులో ప్రశ్నించారు. ప్రస్తుతం ‘స్పిరిట్’లో దీపిక స్థానంలో త్రిప్తి దిమ్రి నటిస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగా, దీపిక పదుకొనే మధ్య వివాదం ఇంకా చల్లారలేదా..? ప్రభాస్ సినిమాపై దీపిక మండిపడుతున్నారా..? ఛాన్స్ దొరికిన ప్రతీసారి సెటైర్లు వేస్తున్నారా..? ఏడాది తర్వాత మళ్లీ ఈ విషయంపై వివాదం ఎందుకు చెలరేగుతోంది..? నిర్మాత ప్రణయ్ వంగా చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గా దీపికా ఏమన్నారు..? అసలు వంగా బ్రదర్స్‌తో దీపిక సమస్యేంటి..? గతేడాది స్పిరిట్ నుంచి దీపికా పదుకొనేను తప్పించినపుడు కేవలం రెమ్యునరేషన్, 8 గంటల వర్కింగ్ గురించనే వార్తలొచ్చాయి. కానీ ఈ మధ్యే నిర్మాత ప్రణయ్ వంగా మాట్లాడుతూ దీపిక లాభాల్లో 10 శాతం వాటా అడిగారని, అది బడ్జెట్ లెక్కలకు సరిపోదనే తీసేశామని చెప్పడం కొత్త వివాదానికి తెరతీసింది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా గతంలో దీపికపై చేసిన విమర్శలతో వివాదం ముదిరింది. దీపికపై ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ఓ జర్నలిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుందిప్పుడు. మేల్ స్టార్స్ ఏళ్లుగా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారని.. అదే ఒక మహిళ అడిగితే మాత్రం ఈ మగ అహంకారం ఎందుకు తట్టుకోలేకపోతోందంటూ ఆ పోస్ట్‌లో గట్టిగా ప్రశ్నించారు. ఒక మహిళ ‘నో’ చెబితే తట్టుకోలేరంటూ జర్నలిస్ట్ చేసిన పోస్టుకు దీపికా పదుకొనే లైక్ చేసారు. దీపిక లైక్ చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతుందిప్పుడు.. మేల్ డామినేషన్ అంటూ వంగ బ్రదర్స్‌ను దీపిక టార్గెట్ చేసినట్లైంది. దీపికాను తప్పించాక.. స్పిరిట్‌లోకి త్రిప్తి దిమ్రి వచ్చారు. ఈ సినిమా 2027, మార్చి 5న విడుదల కానుంది. మరోవైపు దీపికా కూడా సైతం షారుక్ ఖాన్‌తో కింగ్, అల్లు అర్జున్‌తో రాకా లాంటి భారీ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా దూసుకుపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: పసిడి పరుగులు.. ఇవాళ తులం బంగారం ధర ఇదే!

ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..

2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?

గంటల తరబడి మొబైల్‌ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!

Follow Us