2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?
ఆగస్టు 28, 2026న ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది గాఢమైన పాక్షిక చంద్రగ్రహణంగా కనిపించి, చంద్రుడు ముదురు ఎరుపు లేదా రాగి రంగులో దర్శనమివ్వనున్నాడు. ఉత్తర, దక్షిణ అమెరికాలు, యూరప్, ఆఫ్రికాలో గ్రహణం కనిపించనుండగా, భారత్‌లో మాత్రం కనిపించదు. అందువల్ల భారతీయ సంప్రదాయాల ప్రకారం సూతక ఆచారాలు వర్తించవని చెబుతున్నారు.
ఆగస్టు 28, 2026న ఆకాశంలో మరో అరుదైన ఖగోళ సంఘటన చోటుచేసుకోబోతోంది. ఈ ఏడాదికి సంబంధించి చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది సాధారణమైనది కాదు.. గాఢమైన పాక్షిక చంద్రగ్రహణంగా ఏర్పడనుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడి ఉపరితలంపై పెద్ద భాగాన్ని కప్పివేయడం వల్ల, చంద్రుడు ముదురు ఎరుపు, రాగి లేదా తుప్పు రంగులో దర్శనమివ్వనున్నాడు. ఖగోళ శాస్త్రం ప్రకారం, సూర్యుడికి-చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యకాంతి నేరుగా చంద్రుడిపై పడకుండా భూమి నీడ అడ్డుపడుతుంది. వాతావరణం గుండా ప్రయాణించే సూర్యకాంతిలోని ఎరుపు రంగు కాంతి వక్రీభవించి చంద్రుడిపై పడటం వల్ల ఈ రంగు మారుతుంది. ఈసారి చంద్రుడు పూర్తిగా అంబ్రాలోకి ప్రవేశించకపోవడంతో దీనిని గాఢమైన పాక్షిక చంద్రగ్రహణంగా ఖగోళ నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు 28నే రక్షాబంధన్ పర్వదినం కూడా రావడం విశేషం. అయితే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. మన దేశంలో చంద్రగ్రహణం కనిపించదు. ఆస్ట్రేలియా, చైనా, జపాన్ దేశాల్లోనూ ఇది దర్శనమివ్వదు. భారత్‌లో గ్రహణం కనిపించదు కాబట్టి.. సంప్రదాయాల ప్రకారం ఎటువంటి సూతక ఆచారాలు వర్తించవు. దీంతో దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్సాహంగా జరుపుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గంటల తరబడి మొబైల్ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!
వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!
Cheque Book New Rules: చెక్ బుక్‌లపై కొత్త రూల్స్.. మీ పాత చెక్ ఇక చెల్లదా?
అయ్యో.. ఇదేం విడ్డూరం.. యువకుడి కడుపులో గర్భాశయం
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం
నది లేదు.. చుక్క వర్షం పడదు.. నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

