AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: పసిడి పరుగులు.. ఇవాళ తులం బంగారం ధర ఇదే!

Gold Price: పసిడి పరుగులు.. ఇవాళ తులం బంగారం ధర ఇదే!

Phani CH
|

Updated on: Aug 24, 2026 | 6:06 PM

Share

దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఆగస్టు 24న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.880 పెరిగి రూ.1,63,970కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.800 పెరిగి రూ.1,50,300గా నమోదైంది. వెండి ధర కూడా కిలోకు రూ.5,000 పెరిగి రూ.2,75,000కి చేరింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత నేపథ్యంలో సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి.

దేశంలో పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో బంగారం ధరలు గత వారం నుంచి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పశ్చిమాసియాలో రగులుతున్న ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారనే లేదు. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీనికి తోడు డాలర్ రోజు రోజుకు బలహీన పడుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సేఫ్ హెవన్ వైపు తరలిస్తున్నారు. దీంతో పసిడి ధరలు భారీగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్టు 24 సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.880 పెరిగి రూ.1,63,970 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి రూ.1,50,300 కు చేరింది. వెండి ధరకూడా రూ.5,000 పెరిగి కేజీ రూ.2,75,000 లుగా కొనసాగుతోంది. ఆగస్టు 24 సోమవారం దేశంలోని వివిధనగరాల్లో బంగారం, వెండిధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,64,120 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,50,450 పలుకుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,63,970 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,300 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,970 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,300 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,75,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌ చేసుకొని వెళితే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..

2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?

గంటల తరబడి మొబైల్‌ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

Follow Us