నెల్లూరు నగరవాసులకు శుభవార్త. నెల్లూరు నగర పాలక సంస్థ కేవలం ఒక్క రూపాయికే అత్యాధునిక ఏసీ ఫంక్షన్ హాల్‌ను అద్దెకు అందిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజల కోసం కోటి 30 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ హాల్లో 5000 మందికి పైగా కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ అద్భుత సదుపాయం పెళ్లిళ్లు, రిసెప్షన్లు, ఇతర కార్యక్రమాలకు అందుబాటులో ఉంటుంది.