టీ బాయ్ గా మొదలై.. పాన్ ఇండియా హీరోగా మారిన స్టార్ జర్నీ

Samatha

26 August 2026

ఎవరి కథ ఎప్పుడు ఎలా మొదలు అవుతుందో మనం ఎవరం చెప్పలేం. ఈ రోజు స్టార్‌గా వెలిగే ఎంతో మంది జీవితంలో ఊహించని సంఘటనలు ఉంటాయి.

అలాగే మన రాకింగ్ స్టార్ యశ్ జీవితం కూడా అలాంటిదే.. ఒకప్పుడు నటీనటులకు టీలు ఇస్తూ రోజుకు రూ.50 సంపాదించే ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారాడు.

కాగా, ఇప్పుడు మనం తన కెరీర్ ఎలా ? ఎప్పుడు? మొదలైంది. పాన్ ఇండియా స్టార్ వెనకున్న  కష్టం, తన జీవితం ఏంటో వివరంగా తెలుసుకుందాం.

యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత యశ్‌గా పేరు మార్చుకున్నారు. తండ్రి బీఎంటీసీ బస్సు డ్రైవర్, తల్లి గృహిణి.

యశ్ సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉండేది. ఈ క్రమంలోనే డ్రిగ్రీలో చేరినా సినిమాల కోసం డ్రాప్ అవుట్ అయ్యారు, రంగస్థల మూవీలో నటుడి కోసం చాలా ప్రయాత్నాలు చేశాడు.

కానీ నిరాశే ఎదురైంది. రంగస్థల నటులకు టీలు అందిస్తూ రోజుకు రూ.50 సంపాదించే వారు. ఇలా చేస్తూనే సినిమా అవకాశాల కోసం విశ్వప్రయత్నాలు చేశాడు.

చివరికి తనకు అదృష్టం కలిసి వచ్చింది.  కన్నడ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఛాన్స్ కొట్టేశాడు. తర్వాత ఉత్తరాయణ, నంద గోకుల వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యాడు.

2007లో జంబద హుడుగి సినిమాలో నటించి మెప్పించాడు.  గూగ్లీ, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి సినిమాలతో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు  సంపాదించుకున్నాడు. అంతే కాకుండా ఎన్నో అవార్డుల సైతం అందుకొని, స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.