హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం!
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ వేడితో, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు వరుణుడు చల్లని కబురు చెప్పాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది.

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండి వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు వరుణుడు చల్లని కబురెప్పుడు. నగరవ్యాప్తంగా ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, మణికొండ, హైటెక్‌సిటీ, కొండాపూర్ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది.
కూకట్‌పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, బాలానగర్, భరత్ నగర్, మోతీనగర్ ఏరియాల్లోనూ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయంగా మారాయి. అలాగే పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి. వాహనదారుల ఇబ్బంది పడుతున్నారు.
ఇదిలా ఉండగా భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తమైన హైడ్రా, జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు.. నగరంలోని ఎక్కడా నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే సాయంత్రం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
