విశాఖపట్నంలో వరలక్ష్మీ వ్రతం చేసుకున్న ఓ దంపతులు పూజా సామాగ్రితో పాటు బంగారం కూడా పొరపాటున డ్రైనేజీలో పడేశారు. ఐదు తులాల బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా, జేసీబీ సాయంతో పోలీసులు దానిని తిరిగి కనుగొన్నారు. ఇది కేవలం అదృష్టమని, అమ్మవారి దయ అని దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.