యశ్ ‘టాక్సిక్’ కోసం రుక్మిణీ వసంత్ భారీ రెమ్యునరేషన్

25-08-2026

Pic credit - Instagram

Phani Ch

'సప్త సాగరదాచే ఎల్లో' చిత్రంతో దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది.

గీయశ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక భారీ ప్రాజెక్ట్ 'టాక్సిక్'. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ ఓ కీలకమైన, అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది.

కొత్త తారలతో పోలిస్తే, రుక్మిణీకి ఉన్న భారీ క్రేజ్ మరియు ఆమె సహజ నటనను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ఆమెకు ఊహించని రేంజ్‌లో భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా ఆఫర్ చేసినట్లు సమాచారం.

'సప్త సాగరదాచే ఎల్లో' సినిమా రెండు భాగాలలో ప్రియా పాత్రలో అద్భుతమైన భావోద్వేగాలను పండించి, దక్షిణాది సినీ ప్రేక్షకుల హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు.

కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో కూడా రుక్మిణీ వసంత్ వరుసగా బడా ప్రాజెక్టులలో అవకాశాలు దక్కించుకుంటున్నారు.

యశ్ లాంటి గ్లోబల్ స్టార్ సరసన నటించే అవకాశం రావడమే కాకుండా ఈ సినిమా కోసం రుక్మిణి వసంత్‌ ఏకంగా రూ.3 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటుందట.

'టాక్సిక్' సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ చిత్రంలో రుక్మిణీ పోషించే పాత్ర కథను కీలక మలుపు తిప్పే విధంగా ఉంటుందని టాక్.