AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani : కియారా అదృష్టవంతురాలివి.. ఆ అట్టర్ ప్లాప్ సినిమాను మిస్సయ్యావు.. నయనతార భర్త కామెంట్స్..

ఎట్టకేలకు టాక్సిక్ సినిమా అడియన్స్ ముందుకు వచ్చేసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీకి ఉదయం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది కియారా. అందం, అబినయంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

Kiara Advani : కియారా అదృష్టవంతురాలివి.. ఆ అట్టర్ ప్లాప్ సినిమాను మిస్సయ్యావు.. నయనతార భర్త కామెంట్స్..
Kiara Advani
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2026 | 2:28 PM

Share

భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది టాక్సిక్ సినిమా. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా ముందు నుంచి మంచి పైప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది కియారా. ఇదెలా ఉంటే.. ఇటీవల జిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు తన సొంత సినిమా ఫెయిల్యూర్ గురించి ప్రస్తావించి అందరి దృష్టిని ఆకర్షించారు. నటి కియారా అద్వానీని ఉద్దేశించి, తాను గతంలో చెప్పిన కథను కియారా అంగీకరించకపోవడం తనకే మంచిదైందని ఆయన సరదాగా అన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వేదికపై మాట్లాడుతూ, విఘ్నేష్ శివన్ కియారా అద్వానీ వైపు చూస్తూ ఒక పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. ‘కబీర్ సింగ్’ విడుదలకు ముందు తాను కియారాకు ఒక కథ చెప్పడానికి వెళ్ళానని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

కానీ కియారా ఆ కథను అంగీకరించలేదు. ఆ తర్వాత, విఘ్నేష్ శివన్ అదే కథను ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమాగా తీశారు. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఆ సినిమాలో కియారా నటించకపోవడం ఆమె అదృష్టమని ఆయన సరదాగా అన్నారు. విఘ్నేష్ శివన్ నేరుగా కియారాతో మాట్లాడుతూ, “నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే నువ్వు ఆ సినిమాలో నటించలేదు” అని అన్నారు. ఒకవేళ కియారా ఆ సినిమాలో నటించి ఉంటే, ఆ సినిమా వైఫల్యం కూడా ఆమె కెరీర్ ఖాతాలో చేరి ఉండేదని ఆయన సరదాగా అన్నారు. విఘ్నేష్ మాటలు విని కియారా కూడా నవ్వింది.

ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, అతను దాని గురించి ఏమాత్రం సిగ్గుపడకుండా మాట్లాడటం అతని నిరాడంబరతను, హాస్య చతురతను తెలియజేస్తుందని కొందరు అన్నారు. టాక్సిక్ షోలో విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను కియారా ముందే తన సినిమా ఫెయిల్యూర్ గురించి ప్రస్తావించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఎక్కువమంది చదివినవి :  Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..

విఘ్నేష్ శివన్..

ఎక్కువమంది చదివినవి :  Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..

Follow Us